
ఆధార్ సెంటర్స్ కోసం వెతికే వారికి ఒక మంచి వార్త ! మ్యాప్‌మైఇండియా యాప్‌లో ఇకపై ఆథరైజేడ్ ఆధార్ సెంటర్లను ఈజీగా తెలుసుకోవచ్చు. చాలామంది ఆధార్ కార్డులో తప్పులు సరిచేయించుకోవాలన్నా లేదా కొత్తది తీసుకోవాలన్నా.. అసలైన ఆధార్ సెంటర్ ఎక్కడ ఉందో తెలియక ఇబ్బంది పడుతుంటారు. అందుకే, ఆధార్ సంస్థ (UIDAI) ఇప్పుడు MapmyIndiaతో చేతులు కలిపింది. దీనివల్ల రాబోయే రోజుల్లో మీ ఫోన్ నుండే అసలైన ఆధార్ సెంటర్లను తెలుసుకోవచ్చు.
ఈ కొత్త ఫీచర్‌తో మీరు ఏం చేయవచ్చంటే
కేవలం అడ్రస్ తెలుసుకోవడమే కాదు, ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి. మీ ఇంటికి దగ్గరలో ఉన్న అఫీషియల్ ఆధార్ సెంటర్ ఏదో తెలుస్తుంది. దీనివల్ల అనధికార కేంద్రాలకు వెళ్లి మోసపోయే అవకాశం ఉండదు.
మీకు కావాల్సిన పనిని బట్టి ఉదాహరణకు కొత్త ఆధార్, అడ్రస్ మార్పు లేదా ఫోన్ నంబర్ లింక్ చేయడం కోసం ఏ సెంటర్‌కు వెళ్లాలో ముందే తెలుసుకోవచ్చు. చిన్న పిల్లల కోసం ఆధార్ ఎంట్రీ చేసే సెంటర్లు ఎక్కడ ఉన్నాయో కూడా ప్రత్యేకంగా చూపిస్తుంది.
మీకు దగ్గరలోని ఆధార్ సెంటర్ వెతకడం ఎలా
*ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చాక, ముందుగా మీ ఫోన్‌లో Mappls యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
*తరువాత మీ ఫోన్‌లో Location లేదా GPS ఆన్ చేసి ఉంచండి.
*యాప్‌లో ఉన్న సెర్చ్ బార్‌లో Aadhaar Center లేదా Aadhaar Seva Kendra అని టైప్ చేసి సెర్చ్ చేయండి.
*ఇప్పుడు మీ చుట్టుపక్కల లేదా దగ్గరలో ఉన్న ఆధార్ సెంటర్లన్నీ మ్యాప్‌లో కనిపిస్తాయి.
మీకు నచ్చిన సెంటర్ మీద క్లిక్ చేస్తే.. అక్కడ ఏయే పనులు చేస్తారు, అక్కడికి వెళ్లే రూట్ కనిపిస్తాయి. ఇప్పటివరకు చాలామంది గూగుల్‌లో వెతికి తప్పుడు అడ్రస్‌లకు వెళ్లడం లేదా ప్రైవేట్ వ్యక్తులకు ఎక్కువ డబ్బులు ఇచ్చి మోసపోవడం జరుగుతోంది. ప్రభుత్వం గుర్తింపు పొందిన కేంద్రాలను మ్యాప్‌లో పెట్టడం వల్ల.. సామాన్యులకు సమయం, డబ్బు ఆదా అవుతాయి. అయితే ఈ ఫీచర్ రాబోయే కొద్ది నెలల్లో పూర్తిగా అందుబాటులోకి రానుంది.