Reading Time: < 1 minute
Pradeep Ranganathan Funny Comments On Breakups And Love Insurance Company Movie

వరుస విజయాలతో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ తనదైన మేనరిజమ్స్, యూత్‌ఫుల్ కంటెంట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఈ యంగ్ స్టార్, ఇప్పుడు ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ (LIK)తో మరోసారి అలరించడానికి సిద్ధమయ్యారు. విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ప్రదీప్ తన వ్యక్తిగత జీవితం గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సినిమా ప్రమోషన్స్‌లో ప్రదీప్ మాట్లాడుతూ.. తన నిజజీవితంలోని ప్రేమ పాఠాలను సరదాగా పంచుకున్నారు. “నేను సింగిల్‌గా ఉండటానికే ఇష్టపడతాను. ఇప్పటివరకు చాలా బ్రేకప్స్ చూశాను. ప్రేమ విషయంలో నాదో విచిత్రమైన పరిస్థితి.. నేను ఎవరినీ బ్లాక్ చేయను, కానీ అవతలి వాళ్లే నన్ను బ్లాక్ చేస్తూ ఉంటారు” అంటూ నవ్వుతూ చెప్పుకొచ్చారు.

Also Read:Krithi Shetty: నా బ్రేకప్ మా అమ్మకు కూడా తెలుసు..ప్రస్తుతం సింగిల్‌నే!

అంతేకాకుండా, తన కాలేజీ రోజుల్లో చాటింగ్ వేగం గురించి చెబుతూ.. “కాలేజీ రోజుల్లో నేను చాట్‌కు రిప్లై ఇచ్చే వేగం చూస్తే ప్రస్తుతం ఉన్న ChatGPT కూడా షాక్ అవ్వాల్సిందే” అని అన్నారు. ఇక
ఈ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ చిత్రంలో ప్రదీప్ సరసన బ్యూటిఫుల్ కృతి శెట్టి హీరోయిన్‌గా నటించగా, నయనతార ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. విలక్షణ నటుడు ఎస్.జె. సూర్య, కమెడియన్ యోగి బాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌కు తెలుగు రాష్ట్రాల్లో విశేష స్పందన లభించింది. శ్రీ పద్మిని సినిమాస్ బ్యానర్‌పై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఏప్రిల్ 10న ఈ చిత్రం భారీ స్థాయిలో విడుదల కానుంది.