
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్-దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ (AA22xA6) చుట్టూ భారీ ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ఈ చిత్ర టైటిల్ రివీల్‌పై ఇండస్ట్రీలో భారీ ఉత్కంఠ నెలకొంది. రేపు ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ను అధికారికంగా ప్రకటించనున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే టైటిల్ రివీల్ అవ్వడంతో పాటుగా ఫస్ట్ లుక్ పోస్టర్ సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అధికారిక ప్రకటనకు ముందే సోషల్ మీడియాలో AA22xA6 టైటిల్ లీకైనట్లు చెబుతున్న పోస్టర్ ఆసక్తిగా మారింది. అయితే, ఈ పోస్టర్ నిజంగా చిత్ర యూనిట్ విడుదల చేసిందా? లేక ఫ్యాన్స్ AI టూల్స్‌తో క్రియేట్ చేసినదా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకు మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక ధృవీకరణ లేకపోవడంతో, ఈ లీకులపై మరింత క్లారిటీగా తెలుసుకుందాం.
టైటిల్ ఎవరికీ తెలుసు?
‘AA22xA6’ (వర్కింగ్ టైటిల్)తో వస్తున్న ఈ మూవీ టైటిల్ విషయం.. కేవలం అల్లు అర్జున్-అట్లీకి మాత్రమే తెలుసని టాక్. బన్నీ & అట్లీ పీఆర్ టీమ్‌లకూ కూడా టైటిల్ తెలియదని తెలుస్తోంది. అంతేకాదు సోషల్ మీడియాలో విడుదల చేసే కంటెంట్‌ను కూడా రిలీజ్‌కు కేవలం పది నిమిషాల ముందు మాత్రమే అందిస్తానని అట్లీ చెప్పినట్టుగా టాక్. ఇలా టైటిల్ కాన్సెప్ట్ విషయంలో ఇంత పకడ్బందీగా వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే, టైటిల్‌తోనే మేకర్స్.. పెద్ద సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Also Read : రజనీకాంత్ ‘జైలర్ 2’ నుండి షారుఖ్ అవుట్..
Brace for the BlAAst💥
Title Poster – Tomorrow @ 11 AM@alluarjun @Atlee_dir @deepikapadukone#AA22xA6 pic.twitter.com/pPHn70C77o
— Sun Pictures (@sunpictures) April 7, 2026
టైటిల్ పోస్టర్ నిజమేనా:
మేకర్స్ నుంచి అధికారిక ప్రకటనకు ముందే, ఈ చిత్రానికి ‘వైల్డ్ ఫైర్’ అనే టైటిల్ ఫిక్స్ అయ్యిందని సోషల్ మీడియాలో ప్రచారం జోరందుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టర్ కూడా వైరల్ అవుతుంది. ఇప్పటికే విడుదలైన ప్రీ-లుక్ పోస్టర్‌లో పదునైన పంజాలతో మృగం లాంటి చేయి చూపించడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
ఇపుడు వైరల్ అవుతున్న కొత్త పోస్టర్లో, అల్లు అర్జున్ భీకరమైన మృగంలా మారిన లుక్ లీక్ అద్భుతంగా ఉంది. అయినప్పటికీ, లీక్ ప్రభావంతో ఆడియన్స్లో ఆసక్తి పూర్తిగా పోయింది. అయితే, ఆ సదరు లీక్ అయిన పోస్టర్పై నిర్మాణ సంస్థ (SUN PICTURES) లోగో కూడా ఉండటం గమనార్హం. మరి ఇది రేపు రాబోయే అఫిషియల్ పోస్టరా? లేక AI ఆధారంగా డిజైన్ చేసిందా? అనే విషయం రేపటితో క్లారిటీ వస్తుంది.
మేకర్స్‌కు భారీ షాక్:
అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా భారీ సర్‌ప్రైజ్ ప్లాన్ చేసిన మేకర్స్‌కు ఈ లీక్ ఇబ్బందిగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అనధికారిక పోస్టర్‌లు, టైటిల్ ప్రచారం కారణంగా ఫ్యాన్స్‌లో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. కొందరు ఈ లీక్‌ను ఆసక్తిగా తీసుకుంటే, మరికొందరు మాత్రం అధికారిక ప్రకటన వచ్చేవరకు వెయిట్ చేయాలని భావిస్తున్నారు.
‘లెగసీ’ OR ‘వైల్డ్ ఫైర్’ టైటిల్!
గతంలో ఈ AA22xA6 చిత్రానికి ‘లెగసీ’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం మాత్రం ‘లెగసీ’, ‘వైల్డ్ ఫైర్’ అనే రెండు భిన్నమైన టైటిల్స్ వైరల్ అవుతున్నాయి. ఇవేనా.. లేక మరో కొత్త టైటిల్ ఉందా అనే విషయం రేపటితో క్లారిటీ వస్తుంది.
ఫిల్మ్ ఛాంబర్‌లో టైటిల్ రిజిస్టర్:
ఇదిలా ఉండగా, ఓ ప్రముఖ నిర్మాత ‘Wild Fire’ అనే టైటిల్‌ను ఫిల్మ్ ఛాంబర్‌లో రిజిస్టర్ చేయించారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ టైటిల్‌కు, AA22xA6 సినిమాతో సంబంధం ఉందా..లేదా? అన్నది కూడా ప్రస్తుతం సస్పెన్స్‌గా మారింది. ఏదేమైనా.. రేపు ప్రీ-లుక్‌తో పాటు అనౌన్స్‌మెంట్ పోస్టర్ విడుదలతో అన్నీ పుకార్లకు చెక్ పడనుంది.
Happy Birthday to my dearest director @Atlee_dir garu. May abundance shower upon you. Wishing you all the joy, love, and prosperity. Can’t wait for everyone to experience the cinematic magic you’re creating 🖤 pic.twitter.com/Sb7S8Bfpmp
— Allu Arjun (@alluarjun) September 21, 2025
భారీ బడ్జెట్:
దర్శకుడు అట్లీ ఈ ప్రాజెక్ట్‌ను హై-కాన్సెప్ట్ సైన్స్ ఫిక్షన్ యూనివర్స్‌గా తెరకెక్కిస్తున్నాడు. సోషియో-ఫాంటసీ ఎపిక్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ మూడు విభిన్న అవతారాలలో కనిపించనున్నట్లు టాక్. సుమారు రూ. 800 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో దీపకా పదుకునే కీలక పాత్ర పోషిస్తుంది. నేషనల్ క్రష్ రష్మిక మందన్న కూడా మరో కీ రోల్లో నటిస్తున్నారని సమాచారం. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో ఉండగా, 2026 దీపావళి లేదా క్రిస్మస్ సందర్భంగా విడుదలయ్యే అవకాశం ఉంది.