Reading Time: < 1 minute

శ్రీవారిని దర్శించుకున్న ‘రాకాస’ టీమ్.. మొక్కులు చెల్లించుకున్న నిహారిక, శోభన్!

Caption of Image.

ఇటీవల ( ఏప్రిల్ 3న)  విడుదలైన ఫాంటసీ-హర్రర్ డ్రామా ‘రాకాస’ (Rakasa) బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది.తొలి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని తన సత్తా చాటుతోంది.  మూడు రోజుల్లోనే రూ. 15 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. గ్రాండ్ సక్సెస్ ను సొంతం చేసుకున్న సందర్భంగా ‘రాకాస’ చిత్ర బృందం తిరుమల శ్రీవారిని దర్శించుకుంది.  

మంగళవారం తెల్లవారుజామున వీఐపీ విరామ దర్శన సమయంలో నిహారిక కొణిదెలతో పాటు యువ నటుడు సంగీత్ శోభన్, హీరోయిన్ నయన్ సారిక,ఇతర సాంకేతిక నిపుణులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి ఘనస్వాగతం పలికి, దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారి దర్శించుకున్న చిత్రబృందం, తమ మొక్కులను చెల్లించుకున్నారు.

దర్శనానంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు ‘రాకాస’ బృందానికి వేద మంత్రాలతో ఆశీర్వచనం అందజేశారు. అనంతరం టీటీడీ అధికారులు స్వామివారి శేషవస్త్రం, తీర్థప్రసాదాలను నిహారికకు అందజేశారు. ఆలయం వెలుపల మీడియా ప్రతినిధులతో మాట్లాడిన నిహారిక, స్వామివారిని దర్శించుకోవడం ఎప్పుడూ ఒక దివ్యమైన అనుభూతినిస్తుందని, తమ చిత్రం ‘రాకాస’ ప్రేక్షకుల మనసు గెలుచుకుందని తెలిపారు. ఇంత ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు.

 

©️ VIL Media Pvt Ltd.