Reading Time: 4 minutes

కనెక్టికట్  రాష్ట్రంలో ఉన్న న్యూ ఇంగ్లాడుకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక షాపు లో సెలియా బ్రేఫీల్ (Celia Bray field) రాసిన ‘రెబెల్ రైటర్స్ ది ఏక్సిడెంటల్ ఫెమినిస్ట్స్’ (Rebel Writers The Accidental Feminists ) అనే పుస్తకం నాకు కడనపడింది. దీన్ని బ్లూ మర్‌బరీ పబ్లిషింగ్ హౌస్, లండన్ (Bloomsbury Publishing Hou se, London) 2019లో ప్రచురించింది. ఇందులో సెలియా లండన్ కి చెందిన ఏడుగురు రచయిత్రులు, పందొమ్మిది వందల అరవైలలో వారు రాసిన రచనలనల గురించి వివరించింది. తమ అనుభవాలను, అనుభూతులను, వాళ్ళు నిజాయితీగా రాసారని, అవి అప్పటి సమాజాన్ని ఒక్క కుదుపు కుదిపాయని, పురుషాధిక్య సమాజ సిద్ధాంతాలను ప్రశ్నించడమే కాక, ఆ నాటి సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న అసమానతలను, లింగ వివక్షలను, అభద్రతలను వాళ్ళు తమ రచనల్లో ప్రతిబింబించారని, మహిళల జీవితాల్లో మార్పును ఆశించే ఒక పోరాటానికి వాళ్ళు పునాది వేశారని ఆమె అంటుంది.

ఈ రచయిత్రులందరూ చిన్నవాళ్ళు. భిన్న కుటుంబాల నుంచి వచ్చిన వారు. వారిలో సేల్స్‌గల్స్ , ఇద్దరు పిల్లల తల్లులు, టైపిస్ట్, ఆర్ట్ విద్యార్థిని, టెలివిజన్ రిపోర్టర్, అధ్యాపకురాలు ఉన్నారు. ఆ రచయిత్రులు ధనవంతులైనా, బీదవారైనా, మంచి యూనివర్సిటీలలో చదువుకున్నా, అసలు అతి తక్కువ చదువుకున్నా, వారి కుటుంబాలు వారికి ఆలంబనైనా, కాకపోయినా, బయట ప్రపంచానికి తమ ఆలోచనలనూ, అనుభవాలను తెలియజేయాలన్న కోరికలో, అప్పటి సాహిత్య పరిస్థితులను, ప్రమాణాలను ధిక్కరించిన తీరులో, రచన అంటే ఏమిటి, రచయిత్రి ఎలా ఉండాలి, అసలు స్త్రీత్వానికి నిర్వచనం ఏమిటి అన్న విషయాలలో ఏకత్వం కనబరచారు.

వారి రచనల నిండా ఆనందం,హాస్యం ఉంది. కాని చీకటి కోణాలలో దాగున్న హింస, బాధ, అన్యాయం, పక్షపాతం గురించి కూడా వాళ్ళు రాసారు. మహిళలకు కొత్త జీవితాలను, కొత్త పాత్రలను, వినూత్న కుటుంబ వ్యవస్థను వాళ్ళు ఆకాంక్షించారు. వీరు రచనలు చేసే కాలానికి,రెండవ ప్రపంచయుద్ధం సృష్టించిన భీభత్సవంనుండి ఇంకా సమాజం పూర్తిగా కోలుకో లేదు. సామాజిక భద్రత కోసం, ఆనందకరమైన కుటుంబ వ్యవస్థ కోసం ఆలోచించే సమాజం అది. కుటుంబ వ్యవస్థ పరిపూర్ణంగా ఉండాలంటే స్త్రీలు ఎటువంటి వృత్తిని చేబట్టక, తమని తాము పూర్తిగా తమ కుటుంబాల కోసం అంకితం చేసుకుని భార్యలు, తల్లులుగా మాత్రమే వాళ్ళు ఉండాలని కోరుకున్న సమాజం. మీడియా, ప్రెస్, మహిళా పత్రికలు రోజంతా, పూర్తిగా తమ కుటుంబాల కోసం తమ జీవితాన్ని అంకితం చేసే మహిళలను కీర్తించడానికి పూనుకునేవి. అంతే కాదు.తమకు జరిగే అన్యాయాన్ని ఎదిరించే మహిళలను తీవ్రంగా విమర్శించిన రోజులవి.

ఉదాహరణకు ఎడ్నా ఓ బ్రియన్ (Edna O’Brien) నవల ‘ది కంట్రీ గర్ల్’ (The CountryGirls) కాపీలను ఒక ప్రీస్ట్ చర్చ్ ప్రాంగణంలో తగులబెట్టారు. ఆమె మిగతా ఆరు నవలలు కూడా ఐరిష్ సెన్సార్షిప్ ఆఫ్ పబ్లికేషన్ బోర్డ్ (Irish Censorship of Publication Board) నిషేధించింది. ఇంకా చెప్పాలంటే విమర్శకులు కొందరు సామూహికంగా రచయిత్రుల రచనలను తిరస్కరించారు. ప్రచురణ సంస్థలు, మీడియా సాధారణంగా మగ రచయితల రచనలకే ప్రాముఖ్యతనిచ్చాయి. కానీ పురుష ప్రపంచకల్పనా సాహిత్యాన్ని సవాలు చేసిన ఈ రచయిత్రులు విజేతలైన పరివర్తనావాదులుగా నిలుస్తారని ఎవరూ ఊహించలేదు.

ఇక ఈ పుస్తకంలోని రచయిత్రుల దగ్గరికి వస్తే మొట్టమొదటి రచయిత్రి షెలాగ్ డెలానీ (Shelagh Delony). సంచలనాత్మకమైన మొదటి నాటకం ‘ఏ టేస్ట్ ఆఫ్ హనీ’ (A Taste of Honey1958) ఆమె తన ఇరవయ్యవ ఏట రాసింది. అది వెంటనే గుర్తింపు పొంది ప్రేక్షకులు విపరీతంగా వీక్షించారు. అది తర్వాత సినిమాగా కూడా వచ్చింది. విమర్శకులు విభ్రాంతి చెందారు. ఆమెను ’యాంగ్రీ యంగ్ ఉమన్’గా అభివర్ణించారు.రెండు అంకాలు, నాలుగు సీన్లు, ఐదు పాత్రలున్న నాటకం ఆమెది. పదిహేనేళ్ళ స్కూల్ పిల్ల జో (Jo)తో నాటకం మొదలవుతుంది. క్రూరమైన వాస్తవికత, సూటి గా తగిలే సంభాషణలు నాటకాన్ని గొప్పగా తీర్చిదిద్దాయి.

ఎడ్నా ఒ’బ్రియన్ (Ed na O’Brien) రాసిన ’ది కంట్రీ గర్ల్’ (The Cou ntry Girls – 1960) అనే నవల విస్మయపర చి, కమర్షియల్‌గా విజ యం సాధించింది. విమర్శకు లు నవలను మెచ్చుకుంటూనే వివాదాస్పదమైన రచనగా పేర్కొన్నా రు. ఆమె భర్త నవల చది వి, అటువంటి నవల రా సినందుకు ఆమెను క్షమించలేనని ప్రకటించాడు. అ =ప్పటికే సమస్యలమయమైన ఆమె వివాహ జీవితానికి ఈ నవల స్వస్తి చెప్పింది. లిన్నే రీడ్ బ్యాంక్స్ (Lynne Reid Banks) రాసిన ‘ది ఎల్- షేప్ రూమ్’ (The L-Shaped Room – 1960) నవల. దాన్ని ఆమె తన జీవితానికి భిన్నంగా, తన మానసిక సంతులన కోసం రాసానని పేర్కొంది. శార్లెట్ బింగ్రమ్ (Charlotte Bingham) రాసిన ‘కొరొనెట్ అమాంగ్ ది వీడ్స్’ (Coronet Among the Weeds – 1963) నాల్గవది. దీన్ని ఆమె నవలగా రాసినా, దాని హక్కులు కొన్న ఒక న్యూస్ పేపర్ దాన్ని ఆత్మకథగా ప్రకటించింది. ఎందుకంటే ఆమె తన జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఆ నవల రాసినందువలన. పుస్తకంలో ‘వీడ్స్’గా పేర్కొన్నవారు ఆమెకు తారసపడిన యువకులేనట!

‘కొరొనెట్’ అంటే మహిళలు పెట్టుకునే చిన్న కిరీటం అన్న అర్థం వస్తుంది. పుస్తకం బ్రిటన్లో బెస్ట్ సెల్లర్ అయింది. మరో పది దేశాల్లో బాగ అమ్ముడుపోయింది. దాని గురించి లైఫ్ పత్రికలో రాసారు. శార్లెట్ ఉమన్ ఆఫ్ ది ఇయర్’గా ప్రశంసించబడింది. నెల్ డన్ (Nell Dunn) కథా సంపుటి ’అప్ ది జంక్షన్’ (Up The Junction – 1963) లోని పదహారు కథలు పని పాటలు చేస్తూ శ్రమపడే బీద మహిళల గురించిన కథలు. రెండు కథలు అప్పుడు చట్టవిరుద్ధమైన అబార్షన్ గురించి రాసినవి. దొంగతనం చేసాడన్న నేరం మీద జైల్లో పెట్టబడిన బాయ్ ఫ్రెండ్‌ని దర్శించే అమ్మాయి కథ, జైలులో ఉన్న తమ ప్రియులను చూడటానికి వెళ్ళే అమ్మాయిల కథలు కూడా ఉన్నాయి. ఈ సంపుటి విమర్శకుల ప్రశంసలు పొందింది, సంచలనాత్మకం అయింది. ఇది రాసినందుకు నెల్‌కి అవార్డు కూడా లభించింది.

నెల్ డన్ నాలుగు సంవత్సరాల తర్వాత ‘పూర్ కౌ’ (Poor Cow – 1967) అనే నవల కూడా రాసింది. ఇందులోని ప్రధాన పాత్ర జాయ్ (Joy) బిడ్డను కని హాస్పిటల్ నుండి ఇంటికి వస్తుంది. భర్త సంచి నిండా డబ్బుతో వచ్చి ఆమెకు సుఖాన్ని, సెక్యూరిటీని ఇస్తాడు. ఈ నవలకు మంచి పేరు, గుర్తింపు వచ్చింది. నవల వచ్చిన తర్వాత ఆమె కథా సంపుటి ఏభై వేల కాపీలు అమ్ముడుపోవడం విశేషం. వర్జీనియా ఐరన్సైడ్ (Virginia Ironside) రాసిన ’చెల్సియా బర్డ్’ (Chelsea Bird – 1964) నవల ఆరవది. నవల మీద ఎన్నో సమీక్షలు రావడంతో వర్జీనియాకు మంచి గుర్తింపు వచ్చింది. నవల అనేక కాపీలు అమ్ముడుబోయింది. వర్జీనియా రైటర్ గాపేరు పొందినా, తల్లిదండ్రుల అలక్ష్యం వలన జీవితాంతం వంటరితనంతో బాధపడుతూ, డిప్రెషన్‌కి గురయ్యింది.

మార్గరెట్ ఫోర్టర్ (Margaret Forster) రాసిన’జార్జీ గర్ల్’ (GeorgyGirl1965) నవల ఆఖరిది. నవల కమర్షియల్ విజయం సాధించి, సినిమాగా కూడా తీయబడింది. సినిమా విడుదల అయిన తర్వాత నవల ఇంకా బాగా అమ్ముడుపోయింది. పైన పేర్కొన్న నవలలోని స్త్రీ పాత్రలు తమ తల్లిదండ్రుల జీవితాలను గమనిస్తాయి. కానీ వాటికి భిన్నమై న జీవితాలను ఎం చుకుని, తమకు తెలియని భవిష్యత్తులోకి ప్రయాణం చెయ్యడానికి సిద్ధపడి, ఆ సందర్భంగా తమతో ప్రయాణం చెయ్యాలనుకునే స్నేహితులతో, శ్రేయోభిలాషులతో ముందుకు సాగడానికి వెనుకాడరు. తమ ప్రయాణంలో తమను అర్థం చేసుకునే పురుషులు సమాజం దృష్టిలో బలహీనులని, నిజమైన పురుషాధిక్యతను ప్రదర్శించే పురుషులు కారని గ్రహిస్తారు. అంతే కాకుండా కొందరు ప్రేమలో పడినప్పటికీ, తమ సంబంధాలను కొనసాగించే విషయంలోతమ అస్థిత్వాన్ని కోల్పోడానికి సిద్ధపడని పాత్రలు.

ఆఖరిగా ఒక విషయం చెప్పి ముగిస్తాను. రచయిత్రులందరూ తమ జీవితాల్లో, ఆ నాటి సమాజంలో ఎదుర్కొన్న లింగ వివక్షల గురించి అసమానతల గురించి జంకు లేకుండా రాసినప్పటికీ పురుషుల పట్ల ద్వేషాన్ని ప్రదర్శించలేదు. కొందరు పురుషాధిక్యతను అంగీకరించనప్పటికీ, పురుషులను విమర్శించే, వారిని అంచనా వేసే ప్రయత్నం చెయ్యలేదు. అప్పటికున్న చైతన్యం బట్టి ఆ రచయిత్రుల ముఖ్య ఉద్దేశ్యం తమ ఆలోచనలనూ, అనుభవాలను, సమాజంలో మార్పు రావాలన్న తమ ఆ కాంక్షలనూ పాఠకుల ముందుంచి, నిర్ణయాలను వారికే వదిలేయ్యడం! తమ రచనలు సమాజంలో సంచలనం కలిగిస్తాయన్నది ఆ నాడు వారు ఊహించని విషయం.

– బెనర్జీ