
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యుపిఎస్ సి) శుక్రవారం నాడు 2026 మార్చ్ 6న సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సిఎస్ ఇ) 2025 తుది ఫలితాలను వెల్లడించింది. ఈ పరీక్షలో అనుజ్ అగ్నిహోత్రి నెంబర్ 1 ర్యాంక్ సాధించారు. రెండవర్యాంక్ ను రాజేశ్వరి సువే ఎం. మూడో ర్యాంక్ ను ఆకాంక్ష్ ధుల్ సాధించారు. మొత్తం 958 మంది అభ్యర్థులు ఐఏఎస్, ఐఎఫ్‌ఎస్, ఐపిఎస్, ఇతర పోస్ట్ లకు అర్హత సాధించారు.పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వైబ్ సైట్ యుపిఎస్ సి. జివోవి. ఇన్ లేదా యుపిఎస్ సి ఆన్ లైన్ . జివోవి, గల లో రోల్ నెంబర్ వారీగా ఫలితాలను తనిఖీ చేసుకోవచ్చు, డౌన్ లోడ్ చేసుకోవచ్చు.రాజస్థాన్ కోట కు చెందిన డాక్టర్ అనుజ్ అగ్నిహోత్రి మూడో ప్రయత్నంలో ఫస్ట్ ర్యాంక్ సాధించారు.ఇతర ర్యాంకర్లలో 2 ర్యాంక్ రాజేశ్వరి సువేఎం. మూడో ర్యాంక్ ఆకాంక్ష్ ధుల్ కు దక్కింది. తర్వాతి స్థానాలలో 4 రాఘవ్ ఝుంఝున్వాలా, 5 ఇషాన్ భట్నగర్, 6 జన్నియా అరోరా, 7 ఏ ఆర్ రజా మొహైదీన్, 8 పక్షాల సెక్రటరీ, 9 ఆస్తా జైన్, 10 ఉజ్వల్ ప్రియాంక్ ఉన్నారు.
ఫలితాలు ప్రకటించిన తేదీ నుండి 15 రోజులలోపు మార్క్ లు వెబ్ సైట్ లో అందుబాటులో ఉంటాయని యుపిఎస్ సి ఒక ప్రకటనలో తెలిపింది. సివిల్ సర్వీస్ రాత పరీక్ష 2025 ఆగస్టులో జరిగింది. వ్యక్తిత్వ పరీక్ష 2025 డిసెంబర్, 2026 ఫిబ్రవరి మధ్య జరిగింది. ఇద్దరు అభ్యర్థుల ఫలితాలను కమిషన్ విత్ హల్డ్ లో ఉంచింది . 348 మంది సిఫార్సు చేయబడిన అభ్యర్థుల ఫలితాలను తాత్కాలికంగా ఉంచినట్లు అధికారిక నోటీసులో పేర్కొంది.ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ ఫారిన్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్ ఏ, గ్రూప్ బి పోస్ట్ లకు ఈ పరీక్షలను నిర్వహించారు. అభ్యర్థుల ఇంటర్వ్యూలు 2026 జనవరి లో ప్రారంభమయ్యాయి. న్యూఢిల్లీలోని షాజహాన్ రోడ్ లోని ధోల్ పూర్ హౌస్ లో యుపిఎస్ సి ప్రధాన కార్యాలయంలో ఇంటర్ వ్యూలు నిర్వహించబడ్డాయి. ఇంటర్ వ్యూ, వ్యక్తిత్వ పరీక్ష 275 పాయింట్లకు ఉంటాయి.