Reading Time: < 1 minute
Former Mla Balka Suman Released From Adilabad Jail After Securing Bail In Municipal Clash Cases

Balka Suman: ఆదిలాబాద్ జిల్లా జైల్ నుంచి మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ విడుదలయ్యారు. క్యాతనపల్లి మున్సిపల్ ఛైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా జరిగిన గొడవలో సుమన్ సహా ఆయన అనుచరులు రాజి రెడ్డి, అనిల్, లక్ష్మికాంత్ అరెస్ట్ అయ్యారు. 14 రోజులుగా ఆదిలాబాద్ జిల్లా జైలులో ఉన్న నలుగురు క్యాతన పల్లి, చెన్నూరులో నమోదైన 3 కేసుల్లో బెయిల్ రావడంతో విడుదల అయ్యారు. ఇక జైలు నుంచి విడుదలైన మాజీ ఎమ్మెల్యే సుమన్ మాట్లాడుతూ..

Arjun Tendulkar-Saaniya: గ్రాండ్‌గా అర్జున్ టెండూల్కర్-సానియా మెహందీ వేడుక.. వీడియోలు వైరల్

రాళ్లుు విసిరినోళ్ళ మీద కేసులు బుక్ కాలేదు. మా 25 మంది మీద కేసులు పెట్టారు. తర్వాత మా 14 మంది కౌన్సిలర్లకు మంత్రి వివేక్, వాళ్ళ కొడుకు ఎంపి బ్లాంక్ చెక్కులు ఇచ్చి ప్రలోభ పెట్టే ప్రయత్నం చేశారన్నారు. కోట్లాది రూపాయలు ఆఫర్లు చేసారని.. అయినా మావాళ్ళు తలొగ్గలేదన్నారు. తలగ్గకపోతే ఇద్దరు ముగ్గురు కాంగ్రెస్ కౌన్సిలర్లకు మందు తాగించి వాళ్ళతోని మా మహిళా కౌన్సిలర్ల మీద దౌర్జన్యం చూపించారని మంది పడ్డారు.

US-Iran: దుబాయ్‌పై ఇరాన్ మళ్లీ దాడులు.. అమెరికా ఎంబసీలో భారీగా మంటలు

ఈ విషయాలన్నీ కూడా మేము బయటకి తీసుకొచ్చి ప్రజల ముందు పెడితే దాన్ని తట్టుకోలేక మంత్రి వివేక్.. మా మీద అక్రమ కేసులు 25 మంది మీద పెట్టించి మమ్మల్ని 18 వ తేదీ నాడు జైలుకి పంపించారని పేర్కొన్నారు. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రమంత ఇట్లానే తయారైందని అన్నారు.