Reading Time: 2 minutes
Apple Macbook Pro 2026 Launched In India With 1tb Base Storage M5 Pro M5 Max Chips Price And Features Are

MacBook Pro 2026 Launch: ఆపిల్ తన సరికొత్త మ్యాక్‌బుక్ ప్రో (MacBook Pro) మోడళ్లను భారతదేశంలో లాంచ్ చేసింది. 2026 అప్డేట్‌ లో భాగంగా.. కంపెనీ 14, 16 అంగుళాల వేరియంట్స్ లో M5 ప్రో, M5 మ్యాక్స్ చిప్‌లను పరిచయం చేసింది. ఈ కొత్త మ్యాక్‌బుక్ ప్రో మోడళ్లు M5 ప్రో (M5 Pro) మరియు M5 మ్యాక్స్ (M5 Max) చిప్‌ లతో పనిచేస్తాయి. వీటివల్ల ఇవి ముందటి మోడళ్ల కంటే అత్యంత వేగంగా పనిచేస్తాయని కంపెనీ తెలిపింది. ముఖ్యంగా AI పనులను వేగవంతం చేయడానికి వీటిలో ప్రత్యేకమైన ‘ఫ్యూజన్ ఆర్కిటెక్చర్’ను ఉపయోగించారు.

Laureus World Team of the Year: భారత మహిళల జట్టు సంచలనం.. ఆ గ్లోబల్ అవార్డ్కు నామినేషన్..!

ఇంకా వీటిలో లిక్విడ్ రెటినా XDR డిస్‌ప్లేను ఉపయోగించారు. ఇది 1600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. దీనివల్ల ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే వీడియో కాల్స్ కోసం 12MP సెంటర్ స్టేజ్ కెమెరాను అమర్చారు. ఇది మీరు కదులుతున్నా మిమ్మల్ని ఫ్రేమ్ మధ్యలో ఉంచుతుంది. మొట్టమొదటిసారిగా ఈ ల్యాప్‌టాప్‌లలో థండర్‌బోల్ట్ 5 (Thunderbolt 5) పోర్ట్‌లను అందించారు. ఇవి డేటా బదిలీని అత్యంత వేగంగా చేస్తాయి. WI-FI 7, బ్లూటూత్ 6.0 సపోర్ట్ కూడా ఉంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే.. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 24 గంటల వరకు పని చేస్తుందని ఆపిల్ పేర్కొంది.

Jowar Khichdi Recipe: మధుమేహం, అధిక బరువుకు చెక్.. జొన్న కిచిడీతో ఆరోగ్యానికి కొత్త దారి!

బేస్ మోడల్ ఇప్పుడు 1TB స్టోరేజ్ నుండి ప్రారంభమవుతుంది. M5 ప్రో మోడల్ 64GB వరకు, M5 మ్యాక్స్ మోడల్ 128GB వరకు యూనిఫైడ్ మెమరీని సపోర్ట్ చేస్తాయి. కొత్త మ్యాక్‌బుక్ ప్రో ధరలు వేరియంట్‌ను బట్టి ఇలా ఉన్నాయి:
* 14 అంగుళాల మ్యాక్‌బుక్ ప్రో (M5 Pro): ప్రారంభ ధర రూ. 2,49,900.
* 16 అంగుళాల మ్యాక్‌బుక్ ప్రో (M5 Pro): ప్రారంభ ధర రూ. 2,99,900.
* 16 అంగుళాల మ్యాక్‌బుక్ ప్రో (M5 Max): ప్రారంభ ధర రూ. 4,29,900.

ఈ కొత్త మోడళ్ల ప్రీ-ఆర్డర్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఇవి మార్చి 11 నుండి ఆపిల్ ఆన్‌లైన్ స్టోర్, అధీకృత రిటైలర్ల వద్ద కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటాయి. ప్రొఫెషనల్ వీడియో ఎడిటర్లు, డెవలపర్లు, క్రియేటర్లకు ఈ కొత్త మ్యాక్‌బుక్ ప్రో ఒక గొప్ప ఎంపికగా నిలవనుంది.