Reading Time: 2 minutes
Tollywood: ‘మేం అమ్మానాన్నలయ్యాం’.. పెళ్లయిన నాలుగేళ్లకు శుభవార్త చెప్పిన టాలీవుడ్ హీరో.. ఫొటోస్ వైరల్

కోలీవుడ్ యంగ్ హీరో, జెర్సీ ఫేమ్ హరీష్ కళ్యాణ్ శుభవార్త చెప్పాడు. తాను తండ్రిగా ప్రమోషన్ పొందినట్లు వెల్లడించాడు. సోమవారం (మార్చి 02)న తన భార్య పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చినట్టు తెలిపాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు హరీష్ కల్యాణ్ ‘నా జీవితంలోని అద్భుతమైన విషయాన్ని మీతో పంచుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. మా జీవితాల్లో కొత్త అధ్యాయం మొదలైంది. నాకు, నర్మదకు ఈరోజు (మార్చి 2న) పాప పుట్టింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు.మేము కలిసి ఈ అందమైన కొత్త అధ్యాయాన్ని ప్రారంభించినప్పుడు మాకు అండగా నిలిచిన మా కుటుంబం, స్నేహితులు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. పత్రికలు, మీడియా వారి నిరంతర మద్దతు.. దయకు మేము హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాము ఓం నమఃశివాయ’ అని తన ఆనందానికి అక్షర రూపమిచ్చాడు హరీశ్ కల్యాణ్. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట బాగా వైరల్ గా మారింది. దీనని చూసిన పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు హరీష్ కల్యాణ్- నర్మద దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

కాగా.. హరీష్ కళ్యాణ్-నర్మద 2022 అక్టోబర్‌లో వివాహం చేసుకున్నారు. పెళ్లయిన నాలుగేళ్లకు ఈ జంట ఇప్పుడు తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. 2010లో వచ్చిన సింధు సామావెల్లి చిత్రంతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు హరీష్. చందమామ, పొరియాలన్‌, ప్యార్‌ ప్రేమ కాదల్‌, లెట్స్‌ గెట్‌ మ్యారీడ్‌, పార్కింగ్‌, లబ్బర్‌ పండు, డీజిల్‌ తదితర సినిమల్లో హీరోగా చేశాడు . అలాగే న్యాచురల్ స్టార్ నాని నటించిన జెర్సీ సినిమాలో సహాయక నటుడిగామెప్పించాడు. సినిమాల్లోకి రాక ముందు తమిళ బిగ్‌బాస్‌ మొదటి సీజన్‌లో పాల్గొని సెకండ్‌ రన్నరప్‌గా నిలిచాడు యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో. ప్రస్తుతం హరీష్ చేతిలో పలు సినిమాలు ఉన్నాయి.

హరీష్ కల్యాణ్ పోస్ట్..

భార్య నర్మదతో హరీష్ కల్యాణ్..

 

View this post on Instagram

 

A post shared by Harish Kalyan (@iamharishkalyan)

 

View this post on Instagram

 

A post shared by Harish Kalyan (@iamharishkalyan)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.