Reading Time: < 1 minute

భర్తతో గొడవపడి..ఇద్దరు పిల్లలను చంపి..తల్లి ఆత్మహత్య 

Caption of Image.

యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం జరిగింది.. భర్తతో మనస్పర్థల కారణంగా ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. జిల్లాలోని బీబీనగర్ మండలం గొల్లగూడెంలో జరిగింది ఈ దారుణ ఘటన. మంగళవారం ( మార్చి 3 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. గొల్లగూడెంలో మేకల ఐశ్వర్య అనే మహిళ తన ఇద్దరు పిల్లలను చంపి.. ఆత్మహత్యకు పాల్పడింది.  భర్తతో మనస్పర్థలే ఐశ్వర్య ఆత్మహత్య కారణమని చెబుతున్నారు బంధువులు.

గత కొంతకాలంగా వేములకొండ ఉంటున్న ఐశ్వర్య ఆదివారమే పుట్టింటి నుంచి వచ్చి ఆత్మహత్య చేసుకుందని చెబుతున్నారు. పాప వయసు రెండేళ్లు కాగా… బాబు వయసు పది నెలలు అని చెబుతున్నారు బంధువులు. ఐశ్వర్య సహా ఇద్దరు పిల్లల మరణంతో వారి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఐశ్వర్య మృతికి భర్తతో మనస్పర్థలే కారణమా లేక మరేమైనా కారణం ఉందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

©️ VIL Media Pvt Ltd.