Reading Time: < 1 minute
Ss Rajamouli Unhappy With Varanasi Release Timing Amid Spirit And Ramayana Clash

దర్శకధీరుడు S. S. Rajamouli తన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ వారణాసి రిలీజ్ ప్లానింగ్ విషయంలో అసంతృప్తిగా ఉన్నారనే వార్తలు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. మొదటగా ఈ చిత్రాన్ని బాలీవుడ్ లో తెరెకెక్కుతున్న రామాయణ కంటే ముందుగా విడుదల చేయాలనే అనుకున్నారట. అయితే రామాయణం ఇప్పటికే రెండు భాగాలుగా 2026, 2027 దీపావళి సీజన్లను లాక్ చేసుకోవడంతో, దానికి దాదాపు ఆరు నెలల గ్యాప్ ఉంచి వరణాసిని విడుదల చేయాలని రాజమౌళి టీమ్ ప్లాన్ చేసినట్లు టాక్. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి.

Also Read : NANI : చిన్న పిల్లలే కాదు.. లేడీ ఫ్యాన్స్‌కు దూరం అయిన నేచురల్ స్టార్

లేటెస్ట్ గా రెబల్ స్టార్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పిరిట్ మార్చిలో రిలీజ్ కానుండటంతో  పాన్-ఇండియా స్థాయిలో ప్రబాస్‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా స్పిరిట్ భారీ ఓపెనింగ్స్ సాధించే అవకాశముంది. అంటే స్పిరిట్ కేవలం వరణాసి విడుదలకు కేవలం నెల రోజుల ముందు మాత్రమే వస్తుంది. స్పిరిట్ హిట్ అయితే వారణాసికి అనుకున్నంత ఓపెనింగ్ వచ్చే ఛాన్స్ ఉండదు. బాలీవుడ్ లో హిట్ టాక్ వస్తే నెలల తరబడి రన్ ఉంటుంది. ఒక పెద్ద సినిమా చుసిన ఆడియెన్స్ వెంటనే మరొక భారీ సినిమా కోసం థియేటర్స్ కు పరిగెత్తరు. ఆ ప్రభావం కూడా వారణాసికు ఉంటుంది.

ఇక వారణాసి విషయానికి వస్తే సుమారు రూ. 1200, రూ. 1300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న వారణాసి రికవరీలో పెద్ద భాగం రాజమౌళి బ్రాండ్ విలువపైనే ఆధారపడనుంది. ఆర్.ఆర్.ఆర్ తర్వాత ఆయనపై ఉన్న అంచనాలు విపరీతంగా పెరిగాయి. కాబట్టి ఈ సినిమాను లాభాల్లోకి తీసుకురావాలంటే అగ్రెసివ్ మార్కెటింగ్, గ్లోబల్ ప్రమోషన్స్ కీలకం కానున్నాయి. మొత్తానికి వరణాసి రిలీజ్ టైమింగ్ చుట్టూ ఏర్పడిన ఈ పరిస్థితులు ఇండియన్ సినిమా వ్యాపార దిశను ప్రభావితం చేసేలా కనిపిస్తున్నాయి. రాజమౌళి టీమ్ చివరికి ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.