Reading Time: < 1 minute

హైదరాబాద్: గచ్చిబౌలిలో బెంజ్ కారు ర్యాష్ డ్రైవింగ్ చేయడంతో పాటు బానెట్ పై ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ ను కిలో మీటరు లాక్కెళ్లాడు.  నానక్ రామ్ గూడ వద్ద అతివేగంతో దూసుకొచ్చి మరో కారును టిఎస్ 07 ఇఎక్స్ 556 అనే నంబర్ గల బెంజ్ కారు ఢీకొట్టి ఆగకుండా డ్రైవర్ పరారయ్యాడు. వైర్ లెస్ ద్వారా పోలీసులను ట్రాఫిక్ కానిస్టేబుల్ అప్రమత్తం చేశాడు.  ట్రిబుల్ ఐటీ చౌరస్తా జంక్షన్ వద్ద కారును అడ్డుకునేందుకు ప్రయత్నించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ ఢీకొట్టడంతో అతడు బ్యానెట్ పై పడ్డాడు. కిలోమీటరు మేర కానిస్టేబుల్ ను కారుతో సహా డ్రైవర్ లాక్కెళ్లాడు. వాహనదారుల సహాయంతో కారును పోలీసులు అడ్డుకున్నారు.  డ్రైవర్‌కు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయడంతో మద్యం సేవించినట్లు నిర్ధారణ అయ్యింది. గచ్చిబౌలి పోలీసులు బెంజ్ కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.