
మన తెలంగాణ/హైదరాబాద్: పర్యావరణ ప్రేమికుడు, మాజీ ఎంపి జోగినపల్లి సంతోష్‌కుమార్ తడోబా అంధారి టైగర్ రిజర్వులో పర్యటించి అక్కడి చక్కటి దృశ్యాలను తన కెమెరాలో బంధించారు. ఆ సమయంలో అడివిలో తిరుగాడుతున్న ఒక పులిని ఆయన తన కెమెరాతో ఫోటో తీశారు. ఈ దృశ్యాన్ని తన వారాంతపు ఫోటోగ్రఫీలో భాగంగా ఆదివారం తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేయడంతో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది.