Reading Time: < 1 minute
Pakistan Protests Khamenei Death Karachi Us Consulate Attack 12 Killed

Pakistan: అమెరికా, ఇజ్రాయిల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీ మరణించారు. ఈ యుద్ధం మధ్యప్రాచ్యాన్ని వణికిస్తోంది. ఈ యుద్ధం కేవలం ఇజ్రాయిల్, ఇరాన్ మధ్యే కాకుండా, ఇప్పుడు ఇరాన్ దాడుల మూలంగా యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్, ఖతార్ వంటి దేశాలు కూడా యుద్ధంలోకి లాగబడ్డాయి.

Read Also: Pakistan: “భారత్‌తో పోటీ పడేంత సీన్ లేదు”.. సొంత టీమ్‌పై పాకిస్థాన్ మాజీ ప్లేయర్స్ ఫైర్..

ఇదిలా ఉంటే, పాకిస్తాన్‌లో మాత్రం ఖమేనీ మరణం మంటలు అంటుకున్నాయి. కరాచీలో యూఎస్ ఎంబసీ లక్ష్యంగా ఆందోళనకారులు దాడులకు పాల్పడ్డారు. కాంపౌండ్‌లోకి ప్రవేశించాలని చూసిన అల్లరిమూకల్ని యూఎస్ భద్రతా సిబ్బంది కాల్పులు జరిపింది. దీంట్లో 12 మంది మరణించారు. ఇరాన్ ఖమేనీని హత్య చేయడాన్ని నిరసిస్తూ పాక్ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో తీవ్ర హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.

లాహెర్, ఇస్లామాబాద్, కరాచీతో పాటు పీఓకేలోని స్కర్దులో గందరగోళం చెలరేగింది. లాహోర్‌లో పెద్ద సంఖ్యలో జనాలు రోడ్లపైకి వచ్చి అమెరికాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇస్లామాబాద్, కరాచీల్లో భారీ ఎత్తున పోలీసులు, భద్రతా బలగాలు మోహరించాయి.