Reading Time: 2 minutes
Pakistan T20 Exit Salman Ali Agha Admits Failures Sri Lanka Match

Salman Ali Agha: పాకిస్థాన్ టీ20 టోర్నీకి ముందు ఎంత రచ్చ చేసిందో పెద్దగా చెప్పనవసరం లేదు. తామే కప్పు గెలుస్తామన్న రీతిలో బిల్డప్ కొట్టింది. ఐసీసీ, శ్రీలంక క్రికెట్ టీమ్ పాక్‌తో మాట్లాడి కన్వీన్స్ చేసి మరీ టోర్నీలోకి అడుగు పెట్టేలా, భారత్‌పై పాక్ మ్యాచ్‌లు జరిగేలా చేశారు. తీరా చూస్తే శ్రీలంక పాకిస్థాన్ చావు దెబ్బ కొట్టింది. తాము ఇంటికి పోతూ.. పాకిస్థాన్‌ను సైతం వెంట తీసుకెళ్లింది. నిన్నటి మ్యాచ్‌పై కెప్టెన్ సల్మాన్ అఘా స్పందించాడు. తమ జట్టు వైఫల్యాలను స్పష్టంగా అంగీకరించాడు. ముఖ్యంగా మిడిల్ ఆర్డర్ సమస్యే తమ కొంప ముంచిందని ఒప్పుకున్నాడు. “టోర్నమెంట్ మొత్తం మన బ్యాటింగ్ సరిగా పనిచేయలేదు. సాహిబ్‌జాదా ఫర్హాన్‌కు సరైన మద్దతు లభించి ఉంటే కథ వేరుగా ఉండేది. మిడిల్ ఆర్డర్ సమస్య ఎన్నాళ్లుగానో ఉంది. దాన్ని సమీక్షించాల్సిందే. 18 ఓవర్లు బాగా ఆడాం. చివరి రెండు ఓవర్లలో ప్రత్యర్థి బౌలర్లు బాగా బౌలింగ్ చేశారు. 160 కూడా కాపాడటం కష్టమే అయ్యేదేమో! మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన సాహిబ్‌జాదా ఫర్హాన్ తన శతకం జట్టుకు ఉపయోగపడకపోవడం బాధ కలిగించింది. జట్టుకోసం బాగా ఆడాలనుకున్నా. ఫఖర్ సైతం శతకం చేయాలని ఆశపడ్డా. నా శతకం జట్టును సెమీఫైనల్‌కు తీసుకెళ్లలేకపోయింది.. అందుకే బాధగా ఉంది” అని అఘా స్పష్టం చేశాడు.

READ MORE: Pakistan: ఇరాన్ మంటల్లో కాలిపోతున్న లాహోర్, ఇస్లామాబాద్, కరాచీ..

ఇదిలా ఉండగా.. పాకిస్థాన్ సెమీస్‌కు చేరాలంటే శ్రీలంకను 147 పరుగులకే కట్టడి చేయాల్సి ఉండేది. న్యూజిలాండ్ నెట్‌ రన్‌రేట్‌లో దాటాల్సి ఉండేది. కానీ.. శ్రీలంక జట్టు ఏ మాత్రం తగ్గలేదు. చివరి వరకు పోరాడి ఆరు వికెట్ల నష్టానికి 207 పరుగుల చేసింది. శ్రీలంక పోరాడి ఓడింది. పాకిస్థాన్, న్యూజిలాండ్ రెండూ జట్లు మూడు పాయింట్లతో సమానంగా ఉన్నా, మెరుగైన నెట్ రన్‌రేట్ కారణంగా న్యూజిలాండ్ రెండో స్థానంతో సెమీఫైనల్ చేరింది. గ్రూప్‌లోని మరో జట్టు ఇంగ్లాండ్ ఇప్పటికే మూడు విజయాలతో అర్హత సాధించింది. ఇక శ్రీలంక కెప్టెన్ దాసున్ శనక శివతాండవం చేశాడు. కేవలం 31 బంతుల్లో అజేయంగా 76 పరుగులు చేసి మ్యాచ్‌ను చివరి క్షణాల వరకూ తీసుకెళ్లాడు. మొత్తంగా, ఈ మ్యాచ్ పాకిస్థాన్‌కు ఆలస్యంగా వచ్చిన పాఠంలా మారింది. విజయం సాధించినా లక్ష్యం చేరుకోలేకపోవడం జట్టు లోపాలను స్పష్టంగా బయటపెట్టింది. ఇక ముందు మార్పులు తప్పవన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

READ MORE: Ayatollah Arafi: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా ఆయతుల్లా అరాఫీ నియామకం..