
చెన్నై: తమిళ సినీ నటుడు, టీవీకే చీఫ్ విజయ్ నుంచి విడాకులు ఇప్పించాలని అతడి భార్య సంగీత కోర్టు మెట్లు ఎక్కడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. భర్త నుంచి డివోర్స్ కావాలని కోరడం ఒక ఎత్తు అయితే.. డివోర్స్ తీసుకోవడానికి విజయ్ ఓ నటితో అక్రమ సంబంధం పెట్టుకోవడమేనని సంగీత ఆరోపించడం సంచలనంగా మారింది. తన భర్త విజయ్ 2021 నుంచి ఒక నటితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని ఆమె ఆరోపించారు.
సంగీత డివోర్స్ పిటిషన్ వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి నటి త్రిష పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. త్రిష వల్లే విజయ్ పెళ్లి పెటాకులు అయ్యిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇందుకు పలు కారణాలను ఉదహరణగా పేర్కొంటున్నారు. గతంలో విజయ్ బర్త్ డే సందర్భంగా విషెస్ చెబుతూ త్రిష పెట్టిన పోస్ట్‌ను ఇప్పుడు వైరల్ చేస్తున్నారు.
I’m feeling sad for VIJAY , TRISHA & even Sangeetha.
But none can deny their chemistry . Made for each other ❤️🩹.#Vijay #TrishaKrishnan #Sangeetha #Love
pic.twitter.com/TYPufRbLoB— Ananya 🐶 (@Ananyagold) February 27, 2026
అంతేకాకుండా గతంలో విజయ్, త్రిష.. నార్వే, యూరప్ వెళ్లిన ఫొటోలను కూడా డివోర్స్ ఇష్యూ తర్వాత మళ్లీ వెలుగులోకి తెచ్చి.. విజయ్, సంగీత విడిపోవడానికి త్రిషనే కారణమంటూ విమర్శిస్తున్నారు. దీంతో పాటు తిరుప్పాచ్చి సినిమా ప్రమోషన్ సమయంలో త్రిష గురించి విజయ్ చెప్పిన మాటలను కూడా నెటిజన్లు మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
సినిమాల్లో త్రిష నా లక్కీ ఛార్మ్ అని విజయ్ అన్న మాటలను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. విజయ్ త్రిష మత్తు నుంచి బయటకు రావాలని ఇటీవల బీజేపీ చీఫ్ నైనార్ నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలను కూడా కొందరు తిరగదోడుతున్నారు. విజయ్, త్రిష మధ్య ఎఫైర్ ఉందనేది కొత్త విషయమేమి కాదని.. గత సంవత్సరం నుంచి ఈ వార్తలు వినిపిస్తున్నాయని ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు.
Nah man this guy is so shameless 😭😭😭
Cheater Vijay is having extra marital affair with Trisha pic.twitter.com/NWa0Zk7Vi9
— Ayush (@yush_18) February 27, 2026
మరికొందరు జస్టిస్ ఫర్ సంగీత అంటూ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తూ త్రిషను ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు. కొందరు మాత్రం త్రిషకు అండగా నిలుస్తున్నారు. విజయ్ భార్య పిటిషన్ లో త్రిష పేరు ప్రస్తావించలేదని.. ఓ నటి అని మాత్రమే చెప్పిందని సౌత్ క్వీన్‌కు సపోర్టుగా మాట్లాడుతున్నారు. మొత్తానికైతే విజయ్ భార్య సంగీత డివోర్స్ పిటిషన్ వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ఈ ఇష్యూలోకి త్రిషను లాగి నానా యాగి చేస్తున్నారు నెటిజన్లు.
I’ve been following the #Trisha #Vijay story for a few weeks now. Connecting the dots, here is a probable timeline of the relationship
Thread 👇 pic.twitter.com/m58pz00a14
— 𝐓𝐡𝐞 𝐍𝐨 𝐎𝐧𝐞🎭 (@TheNoOne_7) February 27, 2026