
యుద్ధం మొదలైంది. ఇరాన్ దేశంపై ఇజ్రాయెల్ మిస్సైల్ దాడులు చేసింది. 2026, ఫ్రిబవరి 28వ తేదీ ఉదయం.. ఇజ్రాయెల్ ఈ దాడులు చేసినట్లు ఇరాన్ స్పష్టం చేసింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ సిటీలోని.. డౌన్ టౌన్ అనే ప్రాంతంలో రెండు చోట్ల ఈ దాడులు జరిగాయి. ఈ మిస్సైల్ దాడులతో డౌన్ టౌన్ ఏరియాలోని పలు బిల్డింగ్స్ కూలిపోయాయి. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
ఇరాన్ రాజధాని టెహ్రాన్ పై దాడి చేసింది మేమే అంటూ ప్రకటించింది ఇజ్రాయెల్. ముందస్తు దాడి అంటూ ఇజ్రాయెల్ ప్రకటించింది. ముందస్తు దాడి అని ఇజ్రాయెల్ ప్రకటించటం ద్వారా.. ఇక యుద్ధం ఆరంభం అయినట్లే అంటోంది ఇరాన్.
Reports of explosions in Tehran right now.
The Ayatollah’s time has officially run out.
Free Iran. pic.twitter.com/iQPfOH3RTK
— The Persian Jewess (@persianjewess) February 28, 2026
ఇజ్రాయెల్ రాకెట్ల దాడిలో ఎంత మంది చనిపోయారు.. ఎంత నష్టం జరిగింది.. ఎన్ని భవనాలు కూలిపోయాయి అనే విషయాన్ని ఇరాన్ అధికారికంగా ప్రకటించలేదు. ఇజ్రాయెల్ దాడి చేసినట్లు మాత్రమే ప్రకటించింది.
అణ్వాయుధాలపై ఇరాన్ దేశంతో జెనీవాలో జరుగుతున్న చర్చలు ముగిసిన 24 గంటల్లోనే.. ఇజ్రాయెల్ దాడి చేయటం విశేషం. ఇరాన్ పై యుద్ధం తప్పదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదే పదే హెచ్చరించాడు. ఈ క్రమంలోనే ఇరాన్ దేశం చుట్టూ అమెరికా యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు ఇప్పటికే మోహరించాయి. ఇరాన్ పై యుద్ధంలో.. అమెరికాతో కలిసి పని చేస్తామని ఇజ్రాయెల్ గతంలోనే ప్రకటించింది. ఈ క్రమంలోనే.. ఇజ్రాయెల్ ముందస్తు దాడి అంటూ.. ఇరాన్ పై యుద్ధం మొదలుపెట్టేసినట్లుగానే కనిపిస్తుంది.
తన దేశ రాజధాని టెహ్రాన్ పై ఇజ్రాయెల్ దాడికి ప్రతీకారంగా ఇరాన్ ఎలాంటి చర్యలకు దిగుతుంది అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
అణ్వాయుధాలపై ఇరాన్ దేశంతో జెనీవాలో జరుగుతున్న చర్చలు ముగిసిన 24 గంటల్లోనే.. ఇజ్రాయెల్ దాడి చేయటం విశేషం. ఇరాన్ పై యుద్ధం తప్పదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదే పదే హెచ్చరించాడు. ఈ క్రమంలోనే ఇరాన్ దేశం చుట్టూ అమెరికా యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు ఇప్పటికే మోహరించాయి. ఇరాన్ పై యుద్ధంలో.. అమెరికాతో కలిసి పని చేస్తామని ఇజ్రాయెల్ గతంలోనే ప్రకటించింది. ఈ క్రమంలోనే.. ఇజ్రాయెల్ ముందస్తు దాడి అంటూ.. ఇరాన్ పై యుద్ధం మొదలుపెట్టేసినట్లుగానే కనిపిస్తుంది. తన దేశ రాజధాని టెహ్రాన్ పై ఇజ్రాయెల్ దాడికి ప్రతీకారంగా ఇరాన్ ఎలాంటి చర్యలకు దిగుతుంది అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
Latest attack by Iran on Israel 🇮🇱 pic.twitter.com/pR0k31zRrk
— محـترمـــــہ (@Mohtarmah) June 22, 2025