Reading Time: < 1 minute
Us President Donald Trumps State Of Union Address

అమెరికాలో ప్రస్తుతం స్వర్ణయుగం నడుస్తోందని.. గతంలో కంటే బలమైన దేశంగా ఆవిర్భవించిందని అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. ట్రంప్ స్టేట్ ఆఫ్ ది యూనియన్ ప్రసంగం చేశారు. అమెరికాలో అధ్యక్షుడి వార్షిక ప్రసంగాన్ని స్టేట్ ఆఫ్ ది యూనియన్‌గా పిలుస్తారు. అమెరికా రాజ్యాంగం (ఆర్టికల్ II, సెక్షన్ 3) ప్రకారం అధ్యక్షుడు దేశ స్థితి గురించి కాలానుగుణంగా కాంగ్రెస్‌కు వివరించాలి. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ కీలక ఉపన్యాసం చేశారు.

‘‘గత 9 నెలల్లో అక్రమ విదేశీయులు అమెరికాలోకి ప్రవేశించలేదు. అమెరికా ఆర్థిక వ్యవస్థ 3 నెలల్లో బాగా కోలుకుందని చెప్పారు. గ్యాస్ ధరలు తగ్గాయి. బైడెన్ పాలన దేశ చరిత్రలో అత్యంత దారుణమైన ద్రవ్యోల్బణాన్ని ఇచ్చాయి. కానీ ఈ 12 నెలల్లో తన పాలనలో ద్రవ్యోల్బణం కనిష్ట స్థాయికి తగ్గింది. గత డిసెంబర్ చివరి నాటికి 1.7శాతానికి తగ్గించాం. గతంలో కంటే ఇప్పుడు అమెరికన్లు బాగా పని చేస్తున్నారు.’’ అని ట్రంప్ పేర్కొన్నారు.