
చందానగర్, వెలుగు : ఆడుకుంటూ వెళ్లిన ఓ బాలుడు అదృశ్యమయ్యాడు. ఈ ఘటన చందానగర్ పోలీస్స్టేషన్పరిధిలో చోటుచేసుకుంది. నానల్నగర్కు చెందిన అబ్దుల్అజీజ్ఖాన్చందానగర్ సిటీ జెన్కాలనీలో నివాసం ఉండే తన సోదరి షానాజ్భాను ఆరోగ్యం బాగా లేకపోవడంతో పరామర్శించేందుకు శుక్రవారం మధ్యాహ్నం తన చిన్న కుమారుడు షాబాజ్ ఖాన్, మనవడు అనాస్షాబాజ్ఖాన్తో కలిసి వెళ్లాడు.
కుటుంబసభ్యులు అందరూ ఇంట్లో ఉండగా.. అనాస్షాబాజ్ఖాన్(5) తోటి పిల్లలతో కలిసి ఆడుకుంటూ మిస్సయ్యాడు. కుటుంబసభ్యులు చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించకపోవడంతో ఠాణాలో ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.