Reading Time: 2 minutes
Sumanths Thriller Newtons 3rd Law Streaming On To Etv Win Ott

Newtons 3rd Law OTT Release: హీరో సుమంత్ ప్రధాన పాత్రలో నటించిన ఇంటెన్స్ సస్పెన్స్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ‘న్యూటన్స్ 3వ లా’ (Newton’s 3rd Law). 2026 జూలై 31న థియేటర్లలో విడుదలై విమర్శకుల నుండి మంచి ప్రశంసలు అందుకుంది ఈ మూవీ. ‘ప్రతి చర్యకు అంతే సమానమైన ప్రతిచర్య ఉంటుంది’ అనే న్యూటన్ మూడవ నియమం లాగే, మనుషులు చేసే తప్పులకు కర్మ (కర్మ సిద్ధాంతం) ఎలా రియాక్ట్ అవుతుందో ఈ క్రైమ్ థ్రిల్లర్ లో చాలా ఆసక్తికరంగా చూపించారు. అయితే థియేటర్లలో అలరించిన ఈ మూవీ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కి సిద్దమౌతోంది. ఈ సస్పెన్స్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ను ఎప్పుడు ? ఎక్కడ చూడచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

ETV Winలో స్ట్రీమింగ్

రాజేష్ కర్ణ దర్శకత్వంలో రూపొందిన ‘Newton’s 3rd Law’ జూలై 31న థియేటర్లలో విడుదలై, నెల తిరక్కుండానే ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ చిత్రం 2026 ఆగస్టు 27 నుంచి ETV Win వేదికగా స్ట్రీమింగ్ కానుందని ఆ సంస్థ ఆఫీషియల్ గా అనౌన్స్ చేసింది. థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు ఇప్పుడు ఇంట్లోనే ఈ థ్రిల్లర్‌ను చూసే అవకాశం దక్కనుంది. ఈ చిత్రంలో సుమంత్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా తన నటనతో ఆకట్టుకోగా, సీనియర్ నటుడు జగపతి బాబు, శ్రీనివాస్ అవసరాల, రవి వర్మ, త్రినాథ్ వర్మ ఇతర కీలక పాత్రల్లో నటించారు । హరీష్ కోహిర్కర్ నిర్మించిన ఈ చిత్రానికి సింజిత్ యెర్రమిల్లి అద్భుతమైన థ్రిల్లింగ్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు

సినిమా కథ

ఈ కథ 1999 బ్యాక్‌డ్రాప్‌లో జరిగే ఒక మిస్టరీ డబుల్ మర్డర్ కేసు చుట్టూ తిరుగుతుంది. నగరంలో ఒక కాలేజీ విద్యార్థి భవనం పైనుండి పడి మరణించగా, అదే రాత్రి ఒక ఒంటరి తల్లి కారు ప్రమాదంలో చనిపోతుంది. ఈ రెండు వేర్వేరు సంఘటనల వెనుక ఏదో బలమైన కనెక్షన్ ఉందని నమ్మిన ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ వాసుదేవ్ (సుమంత్), ఆ కేసును చేధించే క్రమంలో ఎలాంటి నిజాలు తెలుసుకున్నాడనేదే ఈ సినిమా. “ప్రతి చర్యకు అంతే సమానమైన ప్రతిచర్య ఉంటుంది” అనే న్యూటన్ మూడవ నియమం లాగే.. మనుషులు చేసే తప్పులకు కర్మ (కర్మ సిద్ధాంతం) ఎలా రియాక్ట్ అవుతుందో ఈ క్రైమ్ థ్రిల్లర్ లో చూపించారు.