
బార్లీ అనేది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఒక అద్భుతమైన ధాన్యం.. అయితే, బార్లీ ఎవరు తీసుకోవచ్చు? దీని వల్ల కలిగే ఉపయోగాలు ఏమిటి..? అనే సందేహాలు చాలామందికి ఉంటాయి. సాధారణంగా బార్లీ అనగానే చాలామంది కేవలం బరువు తగ్గడానికే (Weight Loss) వాడతారని అనుకుంటారు. కానీ బరువు తగ్గడమే కాకుండా పలు అనారోగ్య సమస్యలు, మెడికల్ కండిషన్స్ ఉన్నవారు కూడా బార్లీని తమ ఆహారంలో చేర్చుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వాస్తవానికి బార్లీలో పీచు పదార్థం (ఫైబర్), విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో, బరువు తగ్గడంలో, గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో చాలా బాగా సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా.. బరువు కూడా ఈజీగా తగ్గుతుంది. ప్రధానంగా బార్లీలో ప్రోటీన్లు, బి విటమిన్లు (B1, B3, B6), మెగ్నీషియం, ఐరన్, సెలీనియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా.. తక్కువ కేలరీలు కలిగి ఉన్న బార్లీ.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని.. పేర్కొంటున్నారు.
బార్లీ వల్ల కలిగే ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు:
బరువు తగ్గడం – జీర్ణ వ్యవస్థ మెరుగుపడటం: బార్లీలో సాల్యూబుల్ (నీటిలో కరిగే), ఇన్సాల్యూబుల్ (కరగని) ఫైబర్లు అధికంగా ఉంటాయి. ఇది ఒక సహజ సిద్ధమైన డెటాక్సిఫైయర్ గా పనిచేసి, శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతుంది. ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ సులభతరం అవుతుంది. మలబద్ధకం (Constipation) తో బాధపడేవారికి ఇది అద్భుతమైన పరిష్కారం. అంతేకాకుండా.. బరువు కూడా తగ్గుతుంది.
మధుమేహం నియంత్రణ:
బార్లీలో ఉండే అధిక ఫైబర్, బీటా-గ్లూకాన్ అనే పదార్థం, ఫైటో కెమికల్స్ ఇన్సులిన్ స్పైక్స్ కాకుండా అడ్డుకుంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలను క్రమబద్ధీకరించడానికి సహాయపడుతుంది. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు తమ డైట్‌లో బార్లీని తప్పనిసరిగా చేర్చుకోవచ్చు.
కిడ్నీ స్టోన్స్ కరిగించడంలో సహాయం: పరిశోధనల ప్రకారం.. బార్లీ వాటర్ కిడ్నీ స్టోన్స్ ఉన్నవారికి చాలా మంచి ఇన్హిబిటర్‌గా పనిచేస్తుంది. ఇది కిడ్నీలో ఉండే రాళ్లను మూత్రం ద్వారా సులభంగా బయటకు పంపడానికి తోడ్పడుతుంది.
పిత్తాశయ రాళ్ల నివారణ: వేగంగా బరువు తగ్గాలని చూసేవారు గాల్ బ్లాడర్ స్టోన్స్ సమస్యను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. క్రాష్ డైట్‌లో హై ప్రోటీన్ తీసుకున్నవారితో పోలిస్తే, బార్లీ వంటి హై ఫైబర్ ఆహారం తీసుకుంటూ బరువు తగ్గిన వారిలో గాల్ బ్లాడర్ ఆరోగ్యం సురక్షితంగా ఉన్నట్లు పరిశోధనల్లో తేలింది.
క్యాన్సర్ నివారణ: బార్లీకి బాడీని డెటాక్స్ చేసి వ్యర్థాలను వెలికితీసే గుణం ఉండటంతో పాటు యాంటీ-కార్సినోజెనిక్ గుణాలు కూడా ఉన్నాయి. ఇది శరీరంలో ఉండే హానికరమైన ట్యూమర్లు, క్యాన్సర్ కణాలను తొలగించడంలో సహాయపడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.
ఇలా బార్లీ అనేక అనారోగ్య సమస్యలకు అద్భుతమైన ఔషధం. రోజూ సరిపడా మోతాదులో బార్లీని మీ డైట్‌లో భాగం చేసుకోవడం ద్వారా మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే.. ఏమైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా.. సందేహాలున్నా.. వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..