Reading Time: < 1 minute

వికారాబాద్: అనుమానాస్పద వ్యక్తి వద్ద బాలుడు రెస్క్యూ…శిశుగృహకు తరలింపు

Caption of Image.

వికారాబాద్, వెలుగు: వికారాబాద్ పట్టణంలోని మల్లికార్జున స్వామి ఆలయం, రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి అనుమానాస్పద వ్యక్తి వద్ద ఉన్న 10 నెలల బాలుడిని పోలీసులు, శిశు సంక్షేమ శాఖ సిబ్బంది సంయుక్తంగా రక్షించారు. ప్రస్తుతం ఆ చిన్నారిని శిశుగృహ సంరక్షణలో ఉంచినట్లు తెలిపారు. 

బాలుడి తల్లిదండ్రులు లేదా కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే, సరైన గుర్తింపు పత్రాలతో బాలరక్ష భవన్ లేదా శిశుగృహను సంప్రదించాలని జిల్లా బాలల సంరక్షణ అధికారి శ్రీకాంత్ సూచించారు. బాలుడికి సంబంధించిన సమాచారం తెలిసినవారు 89194 13995, 96408 63896 ఫోన్​నంబర్లలో సంప్రదించాలని కోరారు. ఈ ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. 

©️ VIL Media Pvt Ltd.