
శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో ఒక మాస్ డైలాగ్ ఇప్పుడు గుర్తు చేసుకోవాలి. వంద గొడ్లను తిన్న రాబందును ఒక్క తుపానుకు చస్తుంది (One vulture that ate 100 buffaloes dies in one cyclone). అచ్చం అలాంటి సిచువేషనే ఇది. ఏమాత్రం జాలి, దయ, కనికరం లాంటివేవీ లేకుండా.. ఒక్క జూమ్ కాల్ తో.. కేవలం మూడు నిమిషాల్లో 900 మంది జీవితాలను రోడ్డుపాలు చేసిన సీఈవో.. ఇప్పుడు రోడ్డున పడ్డాడు. తన పొజిషన్ చూసుకుని.. ఉద్యోగులను తుచ్ఛమైన వారు అన్నట్లుగా వ్యవహరించిన సీఈఓను కంపెనీ తొలగించింది.
2021లో బెటర్ హోమ్ అండ్ ఫైనాన్స్ అనే కంపెనీకి చీఫ్ ఎక్జిక్యూటివ్ గా పనిచేస్తున్న ఇండో అమెరికన్ ఆంత్రప్రెన్యువర్ విశాల్ గార్గ్.. క్రిస్మస్ కు ముందు ఒక చిన్న జూమ్ మీటింగ్ తో అంత మందిని పంపించేశాడు. అప్పట్లో ఆయన నెటెటివ్ గానో.. పాజిటివ్ గానో ఏదో ఒక రకంగా ఫుల్ పాపులర్ అయ్యాడు.
కంపెనీలోకి హెడ్జ్-ఫండ్ మేనేజర్ డేనియల్ లెవిస్ జాయిన్ అయిన తర్వాత ఆయనను సాగనంపారు. నీకంటే బెటర్ సీఈఓ వచ్చాడు బాబు.. నీ సేవలు ఇక చాలు అంటూ.. లెటర్ చేతిలో పెట్టారు. గార్గ్ ఒక్కడు తప్ప బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు అందరూ ముక్తకంఠంతో ఆయనను టర్మినేట్ చేసేందుకే ఓటు వేశారు. ఆయన అహంకారం, ఏకపక్ష నిర్ణయం, అంతా నాదే అని క్రెడిట్ చేసుకునే విధానంపై అందరూ వ్యతిరేకంగా ఓటు వేశారు.
కంపెనీని ఈయన చేతిలో పెడితే.. 2022 నుంచి 14 వందల 342 కోట్ల రూపాయలు (1.5 బిలయన్ డాలర్లు) లాస్ వచ్చిందట కంపెనీకి. గార్గ్ నాయకత్వంలో స్టాక్ కూడా 90 శాతానికి పడిపోయింది.
ఇండియాలో పుట్టిన గార్గ్.. న్యూయార్క్ లో పెరిగాడు. న్యూయార్క్ యూనివర్సిటీ స్టెర్న్ స్కూల్ఆఫ్ బిజినెస్ లో పట్టా పుచుకున్న గార్గ్… ఆన్ లైన్ లో స్టూడెంట్స్ కు అప్పు ఇచ్చే మై రిచ్ అంకుల్ (My RichUncle) ను స్థాపించాడు. ఆ తర్వాత 2014లో బెటర్ అనే సంస్థను స్థాపించాడు. సంప్రదాయ మార్ట్ గేజ్ విధానానికి విసుకు చెంది బెటర్ ను స్థాపించి పాపులర్ అయ్యాడు.
2021 డిసెంబర్ లో గార్గ్.. ఒకే ఒక్క జూమ్ కాల్ లో 900 మందిని తొలగించడంఅప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ తర్వాత తీవ్ర విమర్వలు రావడంతో కొన్నాళ్లు లీవ్ లో వెళ్లాడు. ఆ తర్వాత సీఈఓగా చేరాడు. ఈ ఘటనపై విమర్శలు వస్తున్నా.. అది కంపెనీ నిర్ణయంలో భాగమేనని కవర్ చేసుకునే ప్రయత్నం చేశాడు. మనం గెలుస్తున్నాం.. మనకు మూడురెట్ల లోన్ వాల్యూమ్ పెరిగింది.. మనం లాభాల్లోకి వచ్చేస్తున్నాం.. అంటూ ఊదరగొడుతూ.. 5 ఏండ్లు కంపెనీని నాషనం చేశాడని బోర్డు మెంబర్లు గుర్రుగా ఉన్నారు. దీంతో వ్యతిరేకంగా ఓటు వేసి తొలగించారు.