Reading Time: 2 minutes
పసిడి ప్రియులకు అలర్ట్.. ఆగస్ట్‌ 16న తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

హైదరాబాద్, ఆగస్ట్ 16: మగువలకు పుత్తడిపై మక్కువ ఎక్కువ. పెళ్లిళ్లు, శుభకార్యాలు.. సందర్భం ఏదైనా ముందుగా గుర్తొచ్చేది బంగారమే. అంతగా మన సంస్కృతి, సంప్రదాయాలతో బంగారం ముడిపడిపోయింది. ఇక వ్యాపార పెట్టుబడులకు కూడా పసిడి మంచి సాధనం. అయితే ప్రస్తుత రోజుల్లో పసిడి ధరలు చూస్తుంటే గుండె బేజారుతుంది. బంగారంతోపాటు ఏమాత్రం తగ్గేదేలే అంటూ వెండి ధరలు కూడా రాకెట్ స్పీడ్‌లో దూసుకుపోతున్నాయి. అందుకే వీటి ధరలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడంపై పసిడి ప్రియులు ఆసక్తి చూపుతుంటారు. ఇక తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్‌, విజయవాడ, విశాఖ నగరాల్లో ఈ రోజు (ఆగస్ట్ 16) వాటి ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం..

నేటి బంగారం ధరలు ఇలా..

24 క్యారెట్ల బంగారం గ్రాము ధర సుమారు రూ.15,513కి చేరింది. ఇక 22 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.14,220, 18 క్యారెట్ల గోల్డ్‌ గ్రాము ధర రూ.11,635గా ఉంది. తులం 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,55,130, తులం 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,42,200, తులం 18 క్యారెట్ల బంగారం ధర రూ.1,16,350 వద్ద కొననసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల సంగతి చూస్తే..

హైదరాబాద్‌లో గ్రాము 24 క్యారెట్ల బంగారం ధర రూ.15,513, 22 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.14,220, 18 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.11,635 వద్ద కొననసాగుతున్నాయి. విజయవాడలో గ్రాము 24 క్యారెట్ల బంగారం ధర రూ.15,513, 22 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.14,220, 18 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.11,635గా ఉన్నాయి. విశాఖపట్నం, మైసూర్‌, చెన్నై, ముంబై, కలకత్తా, బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లోనూ దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

ఇక వెండ ధరల విషయానికొస్తే.. వెండి గ్రాము ధర రూ.250గా ఉంది. 8 గ్రాములు ధర రూ.2000, 10 గ్రాములు ధర రూ.2,500, కిలో వెండి ధర రూ.2,50,000 వరకు ఉంది. శనివారం ధరలే ఈ రోజుకూ కొనసాగుతున్నాయి. ఎలాంటి మార్పులు లేవు. చెన్నైలో కిలో వెండి ధర రూ.2,55,000, ముంబైలో కిలో వెండి ధర రూ.2,50,000, బెంగళూరులో కిలో వెండి ధర రూ.2,50,000, హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.2,55,000, విజయవాడలో కిలో వెండి ధర రూ.2,55,000, విశాఖపట్నంలోనూ రూ.2,55,000 వద్దనే వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. మొత్తంగా బంగారం, వెండి ధరలు ఆగస్ట్‌ 15, 16 తేదీల్లో ఏ మాత్రం తడబాటుకు గురికాకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి.

నోట్‌: బంగారం, వెండి ధరలు ఆయా నగల షాపుల మేకింగ్‌ ఛార్జ్‌లు, జీఎస్టీ, నాణ్యత ఆధారంగా మారుతూ ఉంటాయి. వినియోగదారులు వాటినే పరిగణనలోకి తీసుకోవల్సి ఉంటుంది.