Reading Time: < 1 minute

ఆన్‌‌లైన్‌‌, ఫిడే రేటింగ్‌‌ వేర్వేరుగా ఉండాలి: అర్జున్

Caption of Image.

పారిస్‌‌: ఆన్‌‌లైన్ చెస్ రేటింగ్‌‌లను ఫిడే రేటింగ్‌‌లుగా మార్చాలనే ప్రతిపాదనపై ఇండియా గ్రాండ్‌‌మాస్టర్ అర్జున్ ఎరిగైసి అభ్యంతరం వ్యక్తం చేశాడు. రెండూ వేర్వేరుగా ఉంటేనే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు.

 ‘నాకు ఈ విషయం గురించి పెద్దగా అవగాహన లేదు. దానిగురించి ఆలోచించడం కూడా లేదు. నాకు మొదటగా గుర్తొచ్చేది ఏమిటంటే ఆన్‌‌లైన్‌‌ చెస్‌‌లో మౌస్‌‌ స్లిప్స్‌‌, ఫ్లాగింగ్‌‌ వంటివి చాలా ఉంటాయి. కానీ ఫిడే చెస్‌‌ దీనికి పూర్తి భిన్నంగా ఉంటుంది. అత్యంత వేగవంతమైన టైమ్‌‌ కంట్రోల్‌‌ అయిన వరల్డ్‌‌ బ్లిట్జ్‌‌లో కూడా అనవసరమైన ఫ్లాగింగ్‌‌, మౌస్‌‌ స్లిప్స్‌‌ లేవు. కాబట్టి రెండింటినీ వేరుగా ఉంచడమే మంచిది’ అని అర్జున్‌‌ వివరించాడు. వరల్డ్‌‌ చాంపియన్‌‌ డి. గుకేశ్‌‌ ఆటలో ఎలాంటి ఇబ్బందిలేదన్నాడు.
 

©️ VIL Media Pvt Ltd.