
తాండూరు, వెలుగు: వికారాబాద్ జిల్లా బంట్వారం మండలం బొపునారం గ్రామ పరిధిలో టాస్క్‌ఫోర్స్ అధికారులు శనివారం తనిఖీలు నిర్వహించారు. ఆటోలో తాండూరుకు తరలిస్తున్న 4 క్వింటాళ్ల కల్తీ బెల్లాన్ని పట్టుకున్నారు.
నిందితులు చాంద్ పాషా, మహమ్మద్ కుతుబుద్దీన్‌లను విచారించగా.. వారి దుకాణంలోనూ నిల్వలు ఉన్నట్లు తేలింది. దీంతో మొత్తం 7,500 కిలోల కల్తీ బెల్లాన్ని స్వాధీనం చేసుకున్నారు. బెల్లాన్ని, నిందితులను బంట్వారం పోలీస్ స్టేషన్‌లో అప్పగించినట్లు టాస్క్‌ఫోర్స్ సీఐ అన్వర్ పాషా తెలిపారు.