July 15, 2026

E20 పెట్రోల్‌ వీడియోల వివాదం.. నలుగురు యూట్యూబర్లపై కేసు

E20 పెట్రోల్‌ వీడియోల వివాదం.. నలుగురు యూట్యూబర్లపై కేసు
Reading Time: < 1 minute

E20 పెట్రోల్‌ వీడియోల వివాదం.. నలుగురు యూట్యూబర్లపై కేసు

Caption of Image.

ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ (E20)పై తప్పుడు సమాచారం ప్రచారం చేశారనే ఆరోపణలతో ప్రముఖ యూట్యూబర్, రాజకీయవేత్త మనీష్ కశ్యప్‌తో పాటు మరో ముగ్గురు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లపై నాగ్‌పూర్ సిటీ సైబర్ పోలీసులు FIR నమోదు చేశారు. బీజేపీ సోషల్ మీడియా సెల్ టౌన ప్రెసిడెంట్  శిశిర్ త్రిపాఠి ఇచ్చిన ఫిర్యాదుతో ఈ కేసు నమోదైంది. మనీష్ కశ్యప్‌తో పాటు desi_boysncr ఇన్‌స్టాగ్రామ్ ఖాతా, హర్షిత్ రాఠీ, అంక్లేష్ ఇన్వతీల పేర్లను కూడా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు.

జూలై 3న మనీష్ కశ్యప్ విడుదల చేసిన యూట్యూబ్ వీడియోలో E20 ఇంధనంపై ప్రజలను తప్పుదోవ పట్టించే సమాచారం ఉందని, కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ప్రతిష్టను దెబ్బతీసేలా కంటెంట్ రూపొందించారని ఫిర్యాదులో చెప్పారు. మిగతా ఇన్‌ఫ్లుయెన్సర్లు కూడా ఇదే అంశంపై తప్పుడు ప్రచారం చేశారని ఆరోపించారు. దీంతో పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 356, 352, 296తో పాటు ఐటీ చట్టంలోని సెక్షన్ 67 కింద కేసు నమోదు చేశారు.

కేంద్ర ప్రభుత్వం 20 శాతం ఇథనాల్, 80 శాతం పెట్రోల్ మిశ్రమంతో కూడిన E20 పెట్రోల్ ను ప్రోత్సహిస్తోంది. దిగుమతి చమురు తగ్గించడం, కాలుష్యాన్ని తగ్గించడం, రైతులకు ప్రయోజనం చేకూర్చడం ప్రధాన లక్ష్యాలుగా ఈ పెట్రోల్ ను తీసుకొచ్చింది ప్రభుత్వం. అయితే ఇంజన్ కెపాసిటీ తగ్గుతుందని పాత వాహనాలపై ప్రభావం ఉంటుందని కొందరు వాహనదారులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మాత్రం E20 అనుకూల వాహనాలకు ఈ ఇంధనం పూర్తిగా సురక్షితమని చెబుతోంది. 

©️ VIL Media Pvt Ltd.