
పెళ్లైన కొత్త జంటలకు హనీమూన్ అనేది ఒక మరపురాని అనుభూతి. కానీ.. ఈ జంటకు మాత్రం హనీమూన్ ఒక పీడకలగా మిగిలింది. చేదు అనుభవాన్ని మిగిల్చింది. పశ్చిమ బెంగాల్‌లోని కాలింపాంగ్ జిల్లాలో పర్వత ప్రాంతానికి వెళ్లిన నూతన వధూవరుల జంట, సిటాంగ్‌లోని ఒక ప్రైవేట్ రిసార్ట్‌లో బార్బెక్యూ దగ్గర జరిగిన అగ్ని ప్రమాదంలో కొత్త పెళ్లి కూతురు మంటల్లో చిక్కుకుని తీవ్రంగా గాయపడింది.
Honeymoon turns tragic for a newly wed West Bengal based couple as barbecue blows up leaving with severe burn injuries. Incident took place at a homestay in Shittong, Darjeeling. pic.twitter.com/AjTahELdXk
— Pooja Mehta (@pooja_news) September 18, 2026
సీసీ కెమెరాలో రికార్డ్ అయిన ఈ ఘటనలో.. ఆ జంట కొత్త బార్బెక్యూకు దగ్గరగా కూర్చుని ఉన్నారు. బార్బెక్యూకు అవతలి వైపు కూర్చున్న ఒక వ్యక్తి లేచి.. ఒక డబ్బాలోని ద్రవాన్ని మంటల మీద పోశాడు. అయితే.. దురదృష్టవశాత్తూ మంటలు ఒక్కసారిగా ఉవ్వెత్తున గాల్లోకి వ్యాపించడంతో క్షణాల్లోనే దగ్గరలో కూర్చున్న వివాహిత నికితా దాస్కు అంటుకున్నాయి. నికితా మంటల్లో చిక్కుకుని ఆర్త నాదాలు చేస్తూ ఫ్లోర్ మీద కుప్పకూలిపోయింది.
ఆమె భర్త సమీర్ దాస్, ఆమెను కాపాడే ప్రయత్నంలో వెంటనే ఆమె దగ్గరకు పరిగెత్తాడు. ఆ ద్రవాన్ని పోసిన వ్యక్తి కూడా తన టీ షర్టును తీసి.. దానితో మంటలను ఆర్పడానికి ప్రయత్నించాడు. ఇంతలో.. రిసార్ట్ సిబ్బంది కూడా సాయం చేయడానికి వచ్చారు. అకస్మాత్తుగా చెలరేగిన మంటలు రిసార్ట్‌లో భయాందోళనలు సృష్టించాయి. హుటాహుటిన ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ALSO READ : ఢిల్లీలో మరో నిర్భయ ఘటన..
పశ్చిమ బెంగాల్లోని చోప్రా ప్రాంతానికి చెందిన సమీర్ దాస్, నికితను రెండు నెలల క్రితం పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరూ కలిసి విహారయాత్రకు వెళ్లారు. కొండ ప్రాంతంలోని ఒక ప్రైవేట్ రిసార్ట్‌లో బస చేస్తుండగా ఈ దురదృష్టకర ఘటన జరిగింది. హనీమూన్లో హ్యాపీగా గడిపేందుకు వచ్చిన ఈ జంటను దురదృష్టం ఇలా వెంటాడింది. నికితా ఆరోగ్య పరిస్థితి కొంత ఆందోళనకరంగానే ఉందని వైద్యులు తెలిపారు.