Reading Time: < 1 minute

హైదరాబాద్ GHMC హెడ్డాఫీసు దగ్గర ఉద్రిక్తత… పోలీసులు, స్వచ్ఛ ఆటో కార్మికుల మధ్య తోపులాట

Caption of Image.

హైదరాబాద్ లో ఇంటింటి చెత్త సేకరణను రాంకీ సంస్థకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ స్వచ్ఛ ఆటో కార్మికులు నిరసన తెలుపుతున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో శుక్రవారం ( సెప్టెంబర్ 18 ) జీహెచ్ఎంసీ హీడ్డాఫీసు దగ్గర ఉద్రిక్తత నెలకొంది. జీహెచ్ఎంసీ హెడ్డాఫీసును ముట్టడించేందుకు స్వచ్ఛ ఆటో కార్మికులు భారీగా తరలి రావడంతో పోలీసులకు కార్మికులకు మధ్య తోపులాట నెలకొంది.

ఆఫీసు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన కార్మికులను అడ్డుకోవడంతో పోలీసులకు, ఆటో కార్మికులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. హెడ్డాఫీసు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన ఆటో కార్మికులను అరెస్ట్ చేశారు పోలీసులు. నిరసన చేస్తున్న మహిళా కార్మికులను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం నెలకొంది.

ALSO READ : కోరుట్లలో కొడుకు మృతదేహంతో రోడ్డెక్కిన హరిబాబు తల్లి !

ఇంటింటి చెత్త సేకరణను రాంకీ సంస్థకు అప్పగించడాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు కార్మికులు. జిహెచ్ఎంసి కమిషనర్ కు వినతిపత్రం ఇవ్వడానికి వస్తే మమ్మల్ని అడ్డుకొని అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని అంటున్నారు కార్మికులు. ఇంటింటి చెత్త సేకరణను ప్రైవేటీకరణ చేస్తామనడంతో ఇప్పటికే పదిమంది స్వచ్ఛ కార్మికులు చనిపోయారని ఆరోపిస్తున్నారు కార్మికులు.

©️ VIL Media Pvt Ltd.