July 15, 2026

Samantha : ‘అమ్మ అనే పిలుపు కోసం పరితపించాను’.. మాతృత్వంపై సమంత ఎమోషనల్!

Samantha : 'అమ్మ అనే పిలుపు కోసం పరితపించాను'.. మాతృత్వంపై సమంత ఎమోషనల్!
Reading Time: 2 minutes

Samantha : ‘అమ్మ అనే పిలుపు కోసం పరితపించాను’.. మాతృత్వంపై సమంత ఎమోషనల్!

Caption of Image.

మాతృత్వం ప్రతి మహిళ జీవితంతో  అత్యంత భావోద్వేగమైన అధ్యాయం. ఇప్పుడు స్టార్ హీరోయిన్ సమంతకు కూడా అదే కొత్త ఆనందాన్ని, కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరును 2025 డిసెంబర్‌లో వివాహం చేసుకున్న ఆమె.. త్వరలోనే తల్లి కాబోతున్నట్లు ప్రకటించి అభిమానులకు తీపి కబురు అందించారు.

 ఇటీవల తన సొంత నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ భాగస్వామ్యంతో వచ్చిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం వంద కోట్ల వసూళ్లతో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్‌లో ‘బేబీ బంప్’తో మెరిసిన సామ్.. లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూలో తన మాతృత్వ అనుభూతులపై భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు.

 ‘అమ్మ’ అనే పిలుపు కోసం..

ఈ కొత్త జీవితం ఎంతో ఉత్సాహంగా , విభిన్నంగా ఉంది.  ‘అమ్మ’ అనే పిలుపు కోసం , ఈ అద్భుత క్షణం కోసం ఎంతో కాలంగా పరితపించాను. అందుకే ఈ ప్రయాణంలో నా సర్వస్వాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాను అని సమంత అన్నారు. నాలో సరికొత్త శక్తి, సరికొత్త ఆశయం పెరిగినట్లు అనిపిస్తోంది. జీవితంలో ప్రతి విషయాన్ని ఎంత ప్రేమగా స్వీకరిస్తానో, మాతృత్వాన్నీ అంతే హృదయపూర్వకంగా ఆస్వాదిస్తున్నాను.  ప్రతి రోజు నాకు కొత్త పాఠం నేర్పుతోంది. రాబోయే ప్రతి క్షణాన్ని కృతజ్ఞతతో స్వాగతించేందుకు సిద్ధంగా ఉన్నాను అంటూ సమంత తన మనసులోని భావాలను పంచుకున్నారు.

అదే నా నిజమైన విజయం..

ఇక తన సినీ ప్రయాణంపై కూడా సమంత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంకో 20 ఏళ్ల తర్వాత కూడా ఎవరో నా సినిమాల్లో ఒకదాన్ని చూసి ఆనందిస్తే అదే నాకు అతిపెద్ద అవార్డు. వసూళ్లు, రికార్డులు అన్నీ దాని ముందు చిన్నవే. మంచి కథలను నమ్మి రిస్క్ తీసుకునే నటిగా ప్రజలు నన్ను గుర్తుంచుకోవాలి. అలాగే కొత్త ప్రతిభను పరిశ్రమకు పరిచయం చేయడంలో నేను చిన్న మార్పైనా తీసుకొచ్చానని భావిస్తే అదే నా నిజమైన విజయం అని సమంత చెప్పారు.

ప్రస్తుతం మాతృత్వం కోసం సమంత సినిమాలకు స్వల్ప విరామం తీసుకున్నారు. ‘మా ఇంటి బంగారం’ తర్వాత కొంతకాలం పూర్తిగా కుటుంబానికే సమయం కేటాయించనున్న ఆమె..  మాతృత్వ సెలవుల అనంతరం మరో కొత్త చిత్రంతో అభిమానుల ముందుకు వస్తానని స్పష్టం చేశారు. మరోవైపు తన సొంత నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ ద్వారా కొత్త దర్శకులు, నటీనటులకు అవకాశాలు కల్పిస్తూ ఇండస్ట్రీలో కొత్త ప్రతిభను ప్రోత్సహిస్తున్నారు.  సమంత జీవితంలోని ఈ సరికొత్త ప్రయాణం మరింత అందంగా సాగాలని ఆశిస్తూ అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

 

©️ VIL Media Pvt Ltd.