July 15, 2026

ఎక్కువ డబ్బులు పెట్టి మంచి పెట్రోల్ కొట్టించుకోండి : E20పై గడ్కరీ గడసరి సమాధానం

ఎక్కువ డబ్బులు పెట్టి మంచి పెట్రోల్ కొట్టించుకోండి : E20పై గడ్కరీ గడసరి సమాధానం
Reading Time: 2 minutes

ఎక్కువ డబ్బులు పెట్టి మంచి పెట్రోల్ కొట్టించుకోండి : E20పై గడ్కరీ గడసరి సమాధానం

Caption of Image.

Nitin Gadkari on E20 Fuel: దేశ వ్యాప్తంగా E20 పెట్రోల్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ20 ఆయిల్ వల్ల మైలేజ్ తగ్గిపోవటమే కాకుండా వాహనాల్లో పార్ట్స్ దెబ్బతింటున్నాయని చాలా మంది వాహనదారులు గగ్గోలు పెడుతున్నారు. సాధారణ పెట్రోల్ లో 20 శాతం ఇథనాల్ కలపటం వల్ల మైలేజ్ తగ్గిపోతుందని.. అది 3 నుంచి 5 శాతంగా ఉందని ఇటీవలే కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే కేంద్ర రోడ్డు, రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. ఓ జాతీయ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఇచ్చిన సమాధానం ఎలా ఉందో చూడండీ.. 

ఎక్కువ డబ్బులు పెట్టి మంచి పెట్రోల్ కొట్టించుకోండి:
ఇథనాల్ కలిపిన E20 పెట్రోల్ వద్దు అనుకుంటే.. వాహన యజమానులు 100 శాతం పెట్రోల్ ను కొట్టించుకోవచ్చని.. ఇది వాళ్ల ఛాయిస్ అని.. ఈ20 ఆయిల్ వద్దనుకుంటే పవర్ పెట్రోల్ కొట్టించుకోవచ్చు.. దీనికి అదనంగా డబ్బు చెల్లిస్తే సరిపోతుంది కదా అంటూ ఆయన ఇచ్చిన గడసరి సమాధానంపై కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. 20 శాతం ఇథనాల్ కలిపిన ఆయిల్ వల్ల వాహనాలను పాడవుతున్నాయని.. మైలేజ్ తగ్గిపోతుందంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు కేంద్ర రోడ్డు, రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ. దేశంలో E10, E20, E85 ఇలాంటి పెట్రోల్ లభిస్తుందా అని ప్రశ్నిస్తే.. ఇప్పటికి అయితే E20 పెట్రోల్ అన్ని బంకుల్లో లభించే స్థాయికి చేరిందని వివరించారాయన. 

100 శాతం పెట్రోల్ బంకుల్లో ఉందా: 
E10, E20 పెట్రోల్ వద్దు అనుకుంటున్న వాళ్లకు 100 శాతం పెట్రోల్ లభించే అవకాశం బంకుల్లో ఉందా అని.. వాహనదారుడు డబ్బులు ఎక్కువ చెల్లించినా లభించే పరిస్థితి ఉందా అని ప్రశ్నిస్తే.. అది నా పరిధిలో లేదని.. కేంద్ర పెట్రోలియం, మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుందని స్పష్టం చేశారాయన. పెట్రోల్ బంకుల్లో E20, E10 ప్రత్యేకంగా పంపులు పెట్టాల్సిన బాధ్యత నాది కాదన్నారు నితిన్ గడ్కరీ. 

కేంద్ర ప్రభుత్వంపై నెట్టింట విమర్శల పర్వం: 
వాహనాలు చెడిపోతున్నాయని.. మైలేజ్ రావటం లేదని సోషల్ మీడియాలోనే చూస్తున్నాం అని.. ఆటోమొబైల్ కంపెనీలు, ఆయా వాహనాల తయారీదారులు ఎవరూ ఇప్పటి వరకు ఎలాంటి కంప్లయింట్ చేయలేదని స్పష్టం చేసిన నితిన్ గడ్కరీ.. ఇథనాల్ పెట్రోల్ వల్ల మీ వాహనాలు ఏమైనా ఇబ్బంది పడుతున్నాయా అని నేనే స్వయంగా ఉద్యోగులను కోరానని.. ఇప్పటి వరకు ఎవరూ ఎలాంటి కంప్లయింట్ నమోదు చేయలేదని వివరించారాయన. 

ALSO READ : 2 రోజుల్లో సోనమ్ వాంగ్ చుక్ చనిపోవచ్చు.. 

నా కొడుకుల ఇథనాల్ వాట జస్ట్ 0.5 శాతం మాత్రమే: 
ఏదిఏమైనా ఈ20 పెట్రోల్ వల్ల మైలేజ్ తగ్గుతుంది అనుకుంటే.. వాహనాలు పాడవుతున్నాయని అనుకుంటే.. హ్యాపీగా సాధారణ పెట్రోల్.. 100 శాతం పెట్రోల్ కొట్టించుకోవచ్చని.. దీనికి వాహనదారులే అదనంగా డబ్బు చెల్లించాల్సి వస్తుంది.. ఇందులో ఇబ్బంది ఏముందీ అని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేయటం విశేషం. ఇథనాల్ వ్యాపారంలో తమ కుమారులు ఉన్న విషయాన్ని ప్రస్తావించగా.. నా కుమారులకు ఉన్న వ్యాపారాల్లో ఇథనాల్ వ్యాపారం వాటా చాలా చాలా చిన్నది, వారి వ్యాపారంలో ఇథనాల్ కేవలం 10 శాతం మాత్రమే, అలాగే మన దేశంలో వారి ఇథనాల్ వాట కేవలం 0.5 శాతమే.. పైగా వాటికి 1600 కోట్ల అప్పుడ కూడా ఉందని స్పష్టం చేశారు కేంద్ర మంత్రి గడ్కరీ.  

©️ VIL Media Pvt Ltd.