July 15, 2026

చిన్నారిపై లైంగికదాడి కేసులో.. నిందితుడికి జీవిత ఖైదు..మెదక్ జిల్లా పోక్సో ప్రత్యేక కోర్టు తీర్పు

చిన్నారిపై లైంగికదాడి కేసులో..  నిందితుడికి జీవిత ఖైదు..మెదక్  జిల్లా పోక్సో  ప్రత్యేక కోర్టు తీర్పు
Reading Time: < 1 minute

చిన్నారిపై లైంగికదాడి కేసులో.. నిందితుడికి జీవిత ఖైదు..మెదక్ జిల్లా పోక్సో ప్రత్యేక కోర్టు తీర్పు

Caption of Image.

మనోహరాబాద్, వెలుగు: మూడున్నరేళ్ల చిన్నారిపై లైంగికదాడికి పాల్పడిన కేసులో నిందితుడికి మెదక్  జిల్లా పోక్సో  ప్రత్యేక కోర్టు జీవిత ఖైదుతో పాటు రూ.10 వేల జరిమానా విధించింది. చిన్నారికి రూ.5 లక్షల పరిహారం మంజూరు చేయాలని ఆదేశించినట్లు ఎస్పీ డీవీ శ్రీనివాసరావు తెలిపారు. వివరాలిలా ఉన్నాయి.. గత ఏడాది మార్చి 10న అంగన్‌‌‌‌వాడీ కేంద్రానికి వెళ్లిన చిన్నారి అదృశ్యమైంది. సీసీ పుటేజీ ఆధారంగా నిందితుడిని పోలీసులు గుర్తించారు. 

చిన్నారిని గ్రామ శివారులో గుర్తించి ఆసుపత్రికి తరలించారు. ఎస్సై సుభాష్  గౌడ్  కేసు నమోదు చేయగా, తూప్రాన్  డీఎస్పీలు వెంకట్ రెడ్డి, నరేందర్ గౌడ్  దర్యాప్తు చేశారు. పీపీ బాలయ్య కోర్టులో సాక్ష్యాలు ప్రవేశపెట్టగా, భరోసా లీగల్  అడ్వైజర్  శ్వేత సహకరించారు. నేరం రుజువు కావడంతో పోక్సో కోర్టు న్యాయమూర్తి ఆర్ఎం సుభావాలి నిందితుడికి జీవిత ఖైదు 
విధించారు.

©️ VIL Media Pvt Ltd.