ప్రాణం తీసిన భయం.. పరీక్షల్లో ఫెయిల్ అవుతానని ఇంజనీరింగ్ స్టూడెంట్ ఆత్మహత్య Caption of Image.
జీడిమెట్ల, వెలుగు: పరీక్షల్లో ఫెయిల్ అవుతాననే భయంతో ఓ ఇంజనీరింగ్ స్టూడెంట్ ఆత్మహత్య చేసుకున్నాడు. పేట్‌బషీరాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుచిత్ర, గోదావరి హోమ్స్‌కు చెందిన రాహుల్ మాదాపూర్‌లోని ఓ కాలేజీలో ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. కాగా, గత సెమిస్టర్లో రెండు సబ్జెక్టులుఫెయిల్ అవుతానని ఇంట్లో వారికి చెబుతూ అందోళన చెందేవాడు.సోమవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కి ఉరేసుకున్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.