Reading Time: < 1 minute

పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఇవాళ్టి( జులై 15) తాజా రేట్లు ఇవే!

Caption of Image.

పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్. గత కొన్ని రోజులుగా ఊరటనిచ్చిన బంగారం, వెండి ధరలు ఈరోజు ఒక్కసారిగా భారీగా పెరిగాయి.ఈరోజు, జూలై 15 బుధవారం నాటి తాజా మార్కెట్ వివరాల ప్రకారం…24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర 10 గ్రాములపై ఏకంగా 770 రూపాయలు పెరిగింది. దీంతో నిన్నటితో పోలిస్తే ఈరోజు 10 గ్రాములబంగారం ధర లక్షా 43 వేల 570 రూపాయలకి చేరుకుంది.

ఇక ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములపై 700 రూపాయల మేర పెరిగింది. దీనితో ఈరోజు మార్కెట్‌లో 22 క్యారెట్ల బంగారం ధర లక్షా 34 వేల 600 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది.

వెండి ధరల విషయానికి వస్తే…

వెండి అయితే ఈరోజు కొనుగోలుదారులకు గట్టి షాకే ఇచ్చింది. ఒకే రోజు కేజీ వెండిపై ఏకంగా 5,000 రూపాయలు పెరిగింది. ఈ భారీ పెరుగుదలతో ప్రస్తుతం మార్కెట్‌లో కేజీ సిల్వర్ ధర 2 లక్షల 40 వేల రూపాయలకు చేరుకుంది.

ధరలు పెరగడానికి కారణాలు ?

అమెరికాలో ద్రవ్యోల్బణ గణాంకాలు తగ్గడం, డాలర్ ఇండెక్స్ బలహీనపడటంతో అంతర్జాతీయంగా ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. దీనికి తోడు ముడిచమురు (Crude Oil) ధరలు పెరగడం, అమెరికా- ఇరాన్  ఉద్రిక్తతలు కూడా దేశీయంగా బులియన్ మార్కెట్లపై ప్రభావితం చూపడం కూడా కారణం. 

 

©️ VIL Media Pvt Ltd.