Reading Time: < 1 minute
Tuesday Rashi Phalalu Horoscope For September 15 2026

Tuesday Astrology September 15 2026: నేడు కుంభ రాశి వారికి అనుకూలంగా ఉండనుంది. ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. వ్యాపార, సాఫ్ట్‌వేర్ రంగాల్లో ఉన్న వారికి నూతన అవకాశాలు కలిసివస్తాయి. అయితే ఆరోగ్య విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు కుంభ రాశి వారికి అనుకూలించే దైవం: శ్రీ హేరంబ గణపతి స్వామి. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం: శ్రీ గణపతి కవచం పారాయణం చేయడం శుభకరం. మిథున రాశి వారు స్నేహితుల సహకారంతో నూతన వ్యాపారాలు ప్రారంభించే ప్రయత్నాలు చేస్తారు. చర్మ సంబంధమైన అనారోగ్యాలతో ఇబ్బంది పడుతున్న వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. స్వల్పకాలిక ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఓం గం గణపతయే నమః అనే నామాన్ని జపించడం శ్రేయస్కరం.

సింహ రాశి వారు ప్రభుత్వ సంబంధమైన పలు రకాల కార్యక్రమాలను చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబ పెద్దలతో అనుబంధాలు, ఆప్యాయతలు మరింత బలపడతాయి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం: శ్రీ విఘ్న నివారణ గణపతి స్వామి. సంకటనాశన గణపతి స్తోత్రం పారాయణం చేయడం మంచిది. ప్రముఖ జ్యోతిష్య పండితులు శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు 15 సెప్టెంబర్ 2026 నాటి ద్వాదశ రాశి ఫలాలు, శుభ ఫలితాల కోసం పాటించవలసిన దైవ ఆరాధనల వివరాలు క్రింది వీడియోలో వివరించారు.