
హిందూమతంలో పసుపుకు ఎంతో విశిష్టమైన ప్రాధాన్యత ఉంది. పసుపును పవిత్రతకు, శుభానికి ప్రతీకగా భావిస్తారు. అలాంటి పసుపు కొమ్ములతోనే వినాయకుడిని ఏర్పాటు చేసి పర్యావరణ పరిరక్షణకు సందేశం ఇస్తున్నారు జడ్చర్ల పట్టణంలోని వీర శివాజీ నగర్ కు చెందిన స్థానికులు. వినాయక చవితి సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలోని వీర శివాజీ నగర్‌లో ఏర్పాటు చేసిన గణపతి మండపం, గణనాథుడు విశేషంగా ఆకట్టుకుంటోంది. పసుపు కొమ్ములు, మైదాపిండి, గోనె సంచులను ఉపయోగించి వినాయక విగ్రహాన్ని అద్భుతంగా రూపొందించారు. గత 15 సంవత్సరాలుగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌కు దూరంగా ఉంటూ పర్యావరణహిత గణపతులను ఏర్పాటు చేస్తున్న నిర్వాహకులు… ఈసారి కూడా వినూత్నంగా గణేష్ విగ్రహాన్ని తీర్చిదిద్దారు. భక్తి వేడుకల్లో పసుపుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. పసుపును పవిత్రతకు, శుభానికి ప్రతీకగా భావిస్తారు. అలాంటి పసుపు కొమ్ములతోనే గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు నిర్వాహకులు. సుమారు 40 కిలోల పసుపు కొమ్ములతో పాటు మైదాపిండి, గోనె సంచులను ఉపయోగించి ఈ వినాయక విగ్రహాన్ని రూపొందించారు. ప్రతి ఏడాది వినూత్న రీతిలో వినాయక విగ్రహాలను ఏర్పాటు చేస్తూ పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఈసారి పసుపు కొమ్ములతో ఏర్పాటు చేసిన గణపతి భక్తులను, స్థానిక ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటోంది. గణపతి విగ్రహం మాత్రమే కాదు.. మండపం కూడా పర్యావరణహితమే. వెదురు తడకల పందిరితో మండపాన్ని ఏర్పాటు చేశారు. ప్లాస్టిక్, ఇతర కాలుష్యకారక పదార్థాలకు దూరంగా ఉంటూ సహజసిద్ధమైన వస్తువులతో పందిరిని తీర్చిదిద్దారు. విగ్రహం తయారీ నుంచి నిమజ్జనం వరకు.. అంతా ప్రకృతికి అనుకూలంగానే ఆలోచన చేశారు. పసుపు కొమ్ములు, మైదాపిండి, గోనె సంచులు వంటి సహజ పదార్థాలతో తయారు చేయడంతో నిమజ్జనం తర్వాత పర్యావరణానికి హాని కలగకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. వినాయక చవితి వేడుకల్లో భక్తితో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నారు స్థానికులు. పూజలో పవిత్రమైన పసుపే ఇప్పుడు గణపతి రూపంలో దర్శనమివ్వడంతో ఈ వినాయకుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాడు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సిబ్బందిపై కారం చల్లి బ్యాంకులో దోపిడీ..
కన్నబిడ్డల పట్ల కర్కశంగా మారుతున్న తల్లిదండ్రులు.. ఎందుకు?
Neena Gupta: 67ఏళ్ల వయసులో ప్రెగ్నెంటా..? ఇచ్చిపడేసిన ఒకప్పటి హీరోయిన్
Epic: ఎపిక్ సూపర్ కలెక్షన్స్.. డే1 ఎంతంటే?
Hanuman Ansh: త్రివిక్రమ్ తీసుకొస్తున్నారు సరే తెలుగు ఆడియన్స్ ఎంతవరకు ఆదరిస్తారు?