Reading Time: 2 minutes

మరో భర్త కథ ముగిసింది.. భర్తను చంపేసి పోస్ట్మార్టంలో దొరకకుండా ఏమన్నా స్కెచ్ వేసిందా..?

Caption of Image.

హర్యానా: భార్యా బాధితుల మరణాలకు అడ్డుకట్ట పడటం లేదు. భార్యల చేతిలో భర్తలు చచ్చిపోతూనే ఉన్నారు. నిన్నమొన్న పెళ్లైన రెండు నెలలకే భార్య ఓయో రూంలో ప్రియుడితో కనిపించిన ఘటన కలకలం రేపితే.. హర్యానాలో మరో ఘోరం వెలుగులోకి వచ్చింది. హర్యానాలోని రేవారికి చెందిన 21 ఏళ్ల వ్యక్తిని అతని భార్య, ఆమె ప్రియుడు కలిసి పథకం ప్రకారం హత్య చేశారని పోలీసుల విచారణలో వెల్లడైంది.

అతని గొంతు నులిమి చంపడానికి ప్రయత్నించి, స్పృహ కోల్పోయిన స్థితిలో ఉన్న అతనిని బతికి ఉండగానే కాలువలో పడేశారు. ఆ తర్వాత ఈ ఘటనను ఆత్మహత్యగా లేదా ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోయినట్లుగా చిత్రీకరించడానికి ప్రయత్నించారు. అయితే.. బాధితుడి కుటుంబ సభ్యులు అతని మొబైల్ ఫోన్ నుంచి డిలీట్ చేసిన చాట్‌లు, కాల్ రికార్డులను తిరిగి పొందడంతో ఈ హత్య విషయం వెలుగులోకి వచ్చింది. దీని ఆధారంగా పోలీసులు అతని భార్యను, నిందితులలో ఒకరైన ఆమె ప్రియుడిని అరెస్టు చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హర్యానాలోని జాద్తాల్ గ్రామానికి చెందిన మోను.. జూన్ 7న తన భార్య తన్నును ఆమె పుట్టింటి నుంచి తిరిగి తీసుకురావాల్సి ఉంది. వచ్చేటప్పుడు తన జీతాన్ని కూడా తీసుకురావాలని తన్ను భర్తను కోరింది. భార్య ఏమైనా కొనివ్వమని కోరుతుందేమోనని ఆమె చెప్పినట్టుగానే జూన్ 8న జీతం తీసుకున్న తర్వాత.. మోను ఒక CSC కేంద్రం నుంచి డబ్బు డ్రా చేశాడు. తన స్కూటర్‌పై ఇంటి నుంచి అత్త గారింటికి బయలుదేరాడు. తన్ను  ఆమె ప్రియుడైన సోనుకు మోను వస్తున్న విషయంపై ఉప్పందించింది. సోనూ.. తనతో పాటు మరో ఇద్దరితో కలిసి మోను వచ్చే దారిలో కాపు కాసి ఎదురుచూస్తూ ఉన్నారు. తన్ను, ఆ ముగ్గురు కలిసి మోనును కట్టేసి.. అతను స్పృహ కోల్పోయే వరకు అతని నోరు, ముక్కును గట్టిగా మూసి ఉంచారు. ఆ తర్వాత.. పోస్ట్‌మార్టమ్‌లో హత్యకు బదులుగా నీటిలో మునిగి చనిపోయినట్లు తేలేలా చేయడానికి వారు అతనిని బతికి ఉండగానే కాలువలో పడేశారు. 

►ALSO READ | సియా‭దే ఈ పాపం.. కేతన్ అగర్వాల్ కుటుంబంలో మరో విషాదం

ఈ ఘటన ఆత్మహత్యలా కనిపించేలా చేయడానికి వారు అతని స్కూటర్‌ను కాలువ దగ్గరలోనే ఉంచారు. మోను కనిపించకుండా పోయిన రోజున (జూన్ 8న) అతను.. అతని భార్య తన్నుకు 49 సార్లు కాల్ చేసినట్లు కాల్ లిస్ట్ చూశాక స్పష్టమైంది. అయితే.. వారిద్దరి మధ్య కేవలం ఒక్కసారి మాత్రమే సుమారు మూడు నిమిషాల పాటు సంభాషణ జరిగింది. ఆ రాత్రి మోను ఇంటికి తిరిగి రాకపోవడంతో.. కుటుంబ సభ్యులు అతని కోసం వెతికారు. ఎంతకీ కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు ఫైల్ చేసుకుని మోను కోసం వెతుకులాట సాగించారు. జూన్ 10న, అసల్వాస్ దగ్గరలోని కాలువలో మోను మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మోను మరణం గురించి ముందే తెలిసినప్పటికీ తన్ను కూడా అతను చనిపోయిన విషయం గురించి అతని కుటుంబం కాల్ చేసి చెప్పడంతో ఆమె తల్లిదండ్రులు, సోదరుడు, ఇతర బంధువులతో కలిసి కసోలిలోని తన పుట్టింటి నుంచి జడ్తల్‌లోని అత్తవారింటికి చేరుకుంది. ఆమె భర్త మరణానికి విలపిస్తున్నట్లు అందరికీ అనిపించేలా ఏడుస్తూ అందరినీ నమ్మించింది. అంత్యక్రియలకు హాజరైంది.

సంతాప దినాలు ముగిసే వరకు అన్ని ఆచారాలలో పాల్గొంది. జూన్ 11న, పోలీసులు మోను మొబైల్ ఫోన్‌ను కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఫోన్‌లోని డేటా అంతా డిలీట్ చేసి ఉండటాన్ని అతని కుటుంబం గమనించింది. ఈ పరిణామం వాళ్లలో అనుమానాన్ని కలిగించింది. కుటుంబ సభ్యులు సైబర్ నిపుణులను సంప్రదించి, తొలగించబడిన డేటాను తిరిగి పొందారు. తిరిగి పొందిన చాట్‌లలో తన్ను మోనును కలవడానికి పిలిచినట్లు తేలింది. అక్కడ నుంచి ఆరా తీయగా.. తన్ను చేసిన ఘోరం బయటపడింది.

©️ VIL Media Pvt Ltd.