Reading Time: < 1 minute

మళ్లీ కట్టెల పొయ్యి కష్టాలు తెచ్చిన మోదీ : ఎంపీ వంశీకృష్ణ

Caption of Image.
  • పొగతో ప్రజలు అవస్థ పడుతుంటే ప్రచారంలో ప్రధాని బిజీ
  • ఎల్​పీజీ కొరతను నిరసిస్తూ కట్టెలపై వంట చేసిన ఎంపీ వంశీకృష్ణ

పెద్దపల్లి, వెలుగు: ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ సర్కారు మళ్లీ కట్టెల పొయ్యిని పరిచయం చేస్తున్నదని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మండిపడ్డారు. కట్టెల పొయ్యి పొగతో మహిళలు అవస్థలు పడుతుంటే మోదీ అభివృద్ధి అంటూ ప్రచారంలో మునిగిపోయారని అన్నారు. గ్యాస్ కొరత నేపథ్యంలో ఎంపీ వంశీకృష్ణ కట్టెల పొయ్యిపై స్వయంగా వంట చేసి నిరసన తెలిపారు.

ఒకవైపు దేశం గురించి అంతర్జాతీయ వేదికలపై గొప్పగా చెప్పుకుంటుంటే.. గ్రామాల్లో మాత్రం గ్యాస్ సిలిండర్లు దొరక్క ప్రజలు కట్టెల పొయ్యితో కష్టాలు పడే పరిస్థితి ఉందన్నారు. ఇది కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలకు నిదర్శనమన్నారు. ప్రచార ఆర్భాటాలు మాని.. ప్రధాని ప్రజల ప్రాథమిక అవసరాలపై దృష్టి పెట్టాలని, గ్యాస్ సరఫరా పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు

©️ VIL Media Pvt Ltd.