Reading Time: < 1 minute

పెద్దపల్లి జిల్లాలో వడ్ల దిగుమతి ఆలస్యంపై రైతుల రాస్తారోకో

Caption of Image.

సుల్తానాబాద్, వెలుగు: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామ శివారులోని మమత రైస్ మిల్లు వద్ద వడ్ల దిగుమతి ఆలస్యం అవుతోందని రైతులు గురువారం ఆందోళనకు దిగారు. రాజీవ్ రహదారిపై రైతులు ట్రాక్టర్లను అడ్డుగా ఉంచి రోడ్డుపై బైఠాయించారు. ప్యాక్స్ సెంటర్ల ద్వారా కొనుగోలు చేసి మిల్లుకు తరలించిన వడ్లను దిగుమతి కోసం రెండు రోజులుగా మిల్లు వద్ద  పడిగాపులు కాస్తున్నామని ఎలిగేడు మండలం రాములపల్లి రైతులు మండిపడ్డారు. 

శంకరపట్నం,వెలుగు: కొనుగోలు కేంద్రాలకు వడ్లు తెచ్చి నెలవుతున్నా, వడ్ల కొనుగోళ్లలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని రైతులు మండిపడ్డారు. ఈ మేరకు కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్ గ్రామ రైతులు గురువారం రోడ్డుపై ఆందోళన చేశారు.  రైతుల ధర్నాతో వరంగల్‌‌– కరీంనగర్ ​హైవేపై కొద్దిసేపు వాహనాలు నిలిచిపోయాయి.

©️ VIL Media Pvt Ltd.