Reading Time: 2 minutes
Pm Modi Visits Pawan Kalyan Residence Viral Family Photo Mark Shankar

PM Modi: టాలీవుడ్ పవర్ స్టార్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాసంలో ఈ రోజు (ఆదివారం) ఒక అపురూపమైన సన్నివేశం చోటుచేసుకుంది. ఇటీవల సర్జరీ చేయించుకుని కోలుకుంటున్న పవన్‌ కళ్యాణ్‌ను పరామర్శించేందుకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా వారి ఇంటికి తరలివచ్చారు. అసలు ఏం జరిగిందంటే.. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గత కొద్దిరోజులుగా అనారోగ్యం కారణంగా తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా పవన్‌ కళ్యాణ్ ఇంటికి వచ్చి పరామర్శించి అందరినీ ఆశ్చర్యపరిచారు. పవన్ కళ్యాణ్‌ను గతంలోనే ‘ఆంధీ’ (సుడిగాలి) అని అభివర్ణించిన మోడీ, ఇప్పుడు స్వయంగా ఆయన ఇంటికి రావడం జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది.

20 నిమిషాల పాటు ఆత్మీయ భేటీ
ప్రధాని మోడీ పవన్ నివాసంలో దాదాపు 20 నిమిషాల పాటు గడిపారు. పవన్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోవడమే కాకుండా, ఆయన కుటుంబ సభ్యులతో సరదాగా ముచ్చటించారు. ఈ పర్యటనకు సంబంధించిన ఫోటోలను ప్రధాని స్వయంగా సోషల్ మీడియా వేదికగా పంచుకోవడంతో అవి క్షణాల్లో వైరల్ అయ్యాయి. తాజాగా వైరల్ అవుతున్న ఫోటోలలో ఒక పిక్ మాత్రం ‘పిక్ ఆఫ్ ది డే’గా నిలిచింది. పవన్ కళ్యాణ్ తన కుటుంబంతో కలిసి ప్రధానితో గ్రూప్ ఫోటో దిగారు. ఇందులో పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవా, అకిరా నందన్, ఆద్య, పోలేనా అంజనాలతో పాటు పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. చిన్నారి మార్క్ శంకర్ భుజంపై ప్రధాని మోడీ చేయి వేసి నవ్వుతూ ఫోటోకు పోజు ఇవ్వడం చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట సెన్సేషన్ సృష్టిస్తున్నాయి.

ఈ సందర్భంగా ప్రధాని మోడీకి ధన్యావాదాలు తెలుపుతూ పవన్‌ కళ్యాణ్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ‘నా నివాసానికి వచ్చి పరామర్శించడం గొప్ప అనుభూతి కలిగించింది. నా ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు విచ్చేయడం.. ఆయనలోని ఆప్యాయత, అనురాగం మనవతావాద నాయకత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ప్రధాని మోడీ చూపిన ఆదరణను ఎప్పటికీ గుర్తంచుకుంటాను’ అని రాసుకొచ్చారు.