Reading Time: < 1 minute
Vande Mataram Vs Tamil Anthem Vijay Oath Dmk Tvk Row

Tamil Politics: తమిళనాడులో కొత్త ముఖ్యమంత్రిగా జోసెఫ్ విజయ్ ప్రమాణస్వీకారం చేశారు. ఇలా బాధ్యతలు తీసుకున్న కొన్ని గంటలకే విజయ్‌పై విమర్శలు మొదలయ్యాయి. ప్రతిపక్ష డీఎంకే, అధికార టీవీకేను విమర్శించింది. ప్రమాణస్వీకారంలో ‘వందేమాతరం’’ ముందుగా పాడటంపై డీఎంకే అభ్యతరం వ్యక్తం చేసింది. ‘‘తమిళ రాష్ట్ర గీతానికి’’ ప్రాధాన్యత ఇవ్వలేదని డీఎంకే మండిపడింది. తమిళ గీతానికి అవమానం జరిగిందని ఆరోపించింది.

Read Also: PM Modi: మే 15 లోపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగొచ్చా.. మోడీ వ్యాఖ్యల ఆంతర్యం ఏమిటి.?

చెన్నై రాజ్‌భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ముందు వందేమాతరం, ఆ తర్వాత జాతీయ గీతం ‘జనగణమన’, చివరగా రాష్ట్ర గీతం ‘‘తమిళ్ తాయ్’’ వినిపించారు. సాధారణంగా తమిళనాడులో తమిళ గీతం ముందుగా వినిపించి, చివరగా జాతీయ గీతం పాడటం ఆనవాయితీగా వస్తుందని డీఎంకే గుర్తు చేసింది. ఈ వ్యవహారంపై టీవీకే స్పందిస్తూ.. కార్యక్రమం రాజ్‌భవన్‌లో జరిగినందున పాటల క్రమాన్ని గవర్నర్ కార్యాలయం నిర్ణయిస్తుందని వివరణ ఇచ్చింది. అయితే, ఈ సమాధానంతో డీఎంకే సంతృప్తి చెందడం లేదు. టీవీకే బీజేపీ వైపు వెళ్తోందని ఆరోపించింది.

డీఎంకే నేత టీకేఎస్ ఎలంగోవన్ మాట్లాడుతూ.. తమిళ గీతాన్ని మూడో స్థానానికి నెట్టడం ద్వారా తమిళ ప్రజల భావోద్వేగాలను దెబ్బతీశారని మండిపడ్డారు. ఈ అంశాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్తామని అన్నారు. టీవీకే ప్రభుత్వంలో ఉన్న సీపీఎం, సీపీఐ, వీసీకే, ఎండీఎంకే పార్టీలు తమిళ గీతానికి తగిన ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరాయి. ఇదిలా ఉంటే, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం.. వందేమాతరం తర్వాత జాతీయ గీతం ముందు ఉండాలని పేర్కొంది.