Reading Time: 2 minutes
Kl Rahul Creates History 1000 Runs For Three Ipl Franchises 2026

KL Rahul IPL Record: ఐపీఎల్, టీ20 క్రికెట్‌ అంటే టక్కున గుర్తుకు వచ్చేది కింగ్ కోహ్లీ. కోహ్లీ టీ20 క్రికెట్‌లో అనేక అరుదైన రికార్డులు సొంతం చేసుకున్నాడు. కానీ.. కోహ్లీని మించిన ప్లేయర్ ఒకరు ఉన్నాడు. ఎవరో కాదు.. కేఎల్ రాహుల్. ఐపీఎల్ 2026 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ కేఎల్ రాహుల్ మరో అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. అరుణ్ జైట్లీ స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)తో జరిగిన మ్యాచ్‌లో 23 పరుగులు చేసిన రాహుల్, ఢిల్లీ ఫ్రాంచైజీ తరఫున 1000 పరుగుల మార్కును దాటాడు. తక్కువ స్కోరుకే అవుటైనప్పటికీ, ఐపీఎల్ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని ఒక రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. మూడు వేర్వేరు ఐపీఎల్ ఫ్రాంచైజీల తరఫున 1000 కంటే ఎక్కువ పరుగులు చేసిన తొలి క్రికెటర్‌గా కేఎల్ రాహుల్ చరిత్ర సృష్టించాడు. గతంలో పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల తరఫున ఈ ఘనత సాధించిన రాహుల్, ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున సైతం ఆ మైలురాయిని అందుకున్నాడు.

వేర్వేరు ఫ్రాంచైజీల్లో రాహుల్ పరుగులు:
పంజాబ్ కింగ్స్ : 55 మ్యాచులు : 2548 : పరుగులు
లక్నో సూపర్ జెయింట్స్ : 38 మ్యాచులు : 1410 పరుగులు
ఢిల్లీ క్యాపిటల్స్ : 24 మ్యాచులు : 1007 పరుగులు

ఇక, నిన్నటి మ్యాచ్‌లోని ఆరో ఓవర్లో కార్తీక్ త్యాగి వేసిన బంతిని బౌండరీగా మలచడం ద్వారా రాహుల్ ఈ వేయి పరుగుల ఘనతను పూర్తి చేశాడు. అంతేకాకుండా, ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున అత్యంత వేగంగా (కేవలం 23 ఇన్నింగ్స్‌ల్లో) 1000 పరుగులు చేసిన బ్యాటర్‌గా రాహుల్ నిలిచాడు. గతంలో రిషబ్ పంత్, జేపీ డుమిని 35 ఇన్నింగ్స్‌ల్లో ఈ మార్కును అందుకోగా, రాహుల్ ఆ రికార్డును బద్దలు కొట్టాడు.

ఒక ఫ్రాంచైజీ తరఫున అత్యంత వేగంగా 1000 పరుగులు చేసిన ప్లేయర్స్

క్రిస్ గేల్ : RCB : 20 ఇన్నింగ్స్‌లు
షాన్ మార్ష్ : PBKS : 21: ఇన్నింగ్స్‌లు
లెండిల్ సిమన్స్ : MI : 23 ఇన్నింగ్స్‌లు
కేఎల్ రాహుల్: PBKS : 23 ఇన్నింగ్స్‌లు
కేఎల్ రాహుల్ : DC : 24 ఇన్నింగ్స్‌లు
డెవాన్ కాన్వే : CSK : 24 ఇన్నింగ్స్‌లు

ఇక, ప్రస్తుత ఐపీఎల్ 2026 సీజన్‌లో రాహుల్ అద్భుతంగా రాణిస్తున్నాడు. పంజాబ్ కింగ్స్‌పై చేసిన 152 పరుగుల భారీ ఇన్నింగ్స్ ఈ సీజన్‌లో రాహుల్ ఫామ్‌కు నిదర్శనం. ప్రస్తుతం 11 మ్యాచ్‌ల్లో 180 స్ట్రైక్ రేట్‌తో 468 పరుగులు చేసిన రాహుల్, ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన టాప్-3 బ్యాటర్లలో ఒకరిగా కొనసాగుతున్నాడు. తన అగ్రెసివ్ బ్యాటింగ్‌తో ఢిల్లీ జట్టుకు వెన్నెముకగా మారాడు.