
అల్లు అర్జున్ హీరోగా నటించిన సూపర్ హిట్ సినిమాల్లో ‘రేసు గుర్రం’ ఒకటి. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటించింది. అలాగే కిక్ శ్యామ్ బన్నీ సోదరుడి పాత్రలో కనిపించారు. భోజ్ పురి హీరో రవి కిషన్ విలన్ గా యాక్ట్ చేశారు. వీరితో పాటు బ్రహ్మానందం, ప్రకాశ్ రాజ్ తదితరులు కీలక పాత్రల్లో మెరిశారు. బేబి భవ్య సమర్పణలో లక్ష్మీనరసింహ ప్రొడక్షన్స్‌పై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), వెంకటేశ్వ రావు నిర్మించిన ఈ సినిమాకు థమన్ సంగీతం అందించారు. పక్కా యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా 2014 ఏప్రిల్ 11న విడుదలై హిట్‌గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఇప్పుడీ సినిమా మళ్లీ థియేటర్లలోకి రానుంది. అల్లు అర్జున్ పుట్టినరోజుని పురస్కరించుకుని ఏప్రిల్ 8న ఈ బ్లాక్ బస్టర్ మూవీ రీ రిలీజ్ అయ్యింది. ఈ క్రమంలో రేసుగుర్రం సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికర విషయం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. అదేంటంటే,.
రేసుగుర్రం సినిమాకు హీరోగా అల్లు అర్జున్ ఫస్ట్ ఛాయిస్ కాదట. ముందుగా ఈ కథను సూపర్ స్టార్ మహేశ్ బాబును దృష్టిలో పెట్టుకుని స్టైలిష్ గా హీరో పాత్రను డిజైన్ చేశారట సురేందర్ రెడ్డి. మహేశ్ కు కథ కూడా వినిపించాడట. సురేందర్ రెడ్డి కథకు మహేష్ కూడా బాగా ఇంప్రెస్ అయ్యాడట. అయితే అప్పటికే మహేష్ చేతిలో పలు సినిమాలు ఉన్నాయట. దీంతో రేసు గుర్రం సినిమాకు కాస్త టైమ్ ఇవ్వాలని అడిగారట. అయితే సురేందర్ రెడ్డి మహేశ్ బాబు బిజీ షెడ్యూల్ ను గమనించి అదే కథను అల్లు అర్జున్ కు వినిపించాడట. అప్పటికీ మంచి మాస్ కథ కోసం వెయిట్ చేస్తున్న బన్నీకి రేసుగుర్రం కథ బాగా నచ్చింది. వెంటనే ఒకే చెప్పేశాడు. అలా రేసుగుర్రం సినిమా పట్టాలెక్కింది . ఈ సినిమాలో యాక్షన్, కామెడీ, బ్రదర్ సెంటిమెంట్ అన్నీ సమపాళ్లలో బాగా పండాయి. రేసు గుర్రం సినిమాతోనే అల్లు అర్జున్ మొదటిసారి రూ.50 కోట్ల క్లబ్ లో చేరిపోయాడు. ఒకవేళ రేసు గుర్రం సినిమా మహేశ్ బాబు చేసి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో తెలియదు.. కానీ లక్కీ పాత్ర అల్లు అర్జున్ కు పర్ ఫెక్ట్ గా సూట్ అయ్యింది. అందుకే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల మోత మోగించింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.