
Petrol Diesel Price Hike: వాహనదారులకు ఇది చేదు వార్త అనే చెప్పాలి. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) సూచన ప్రాయంగా వెల్లడించింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు (Crude Oil) ధరలు పెరుగుతున్నప్పటికీ, భారత్ ఆ భారాన్ని ప్రజలపై పడకుండా నియంత్రిస్తోందని, అయితే ఇది ఇలాగే కొనసాగితే ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతుందని IMF హెచ్చరించింది.
కృష్ణ శ్రీనివాసన్ ఏమన్నారంటే?
మే 5న జరిగిన ‘నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్’ కార్యక్రమంలో IMF ఆసియా పసిఫిక్ విభాగం డైరెక్టర్ కృష్ణ శ్రీనివాసన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “ముడిచమురు ధరలు పెరిగినప్పుడు ఆ ప్రభావాన్ని వినియోగదారులకు బదిలీ చేయకపోతే, మార్కెట్ సమతుల్యత దెబ్బతింటుంది. భవిష్యత్తులో పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడంపై దృష్టి సారించాల్సి ఉంటుంది” అని పేర్కొన్నారు. అయితే ఎరువుల ధరలను తగ్గించడం ద్వారా సామాన్యుల జేబుపై భారం తగ్గించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇది కూడా చదవండి: RBI: రద్దు చేసిన రూ.2,000 నోట్లు ఏమయ్యాయి? ఆర్‌బీఐ వాటిని ఏం చేస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ముడిచమురు ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?
అమెరికా – ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా ముడిచమురు సరఫరాకు ఆటంకం ఏర్పడుతోంది. ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 110 డాలర్ల పైన ట్రేడ్ అవుతుండగా, ఏప్రిల్ 30 నాటికి భారత క్రూడ్ బాస్కెట్ ధర బ్యారెల్‌కు సుమారు 118.70 డాలర్లుగా నమోదైంది.
సరఫరాపై ప్రభావం
మధ్యప్రాచ్యంలో 2026 ఫిబ్రవరి నుంచి కొనసాగుతున్న ఉద్రిక్తతల వల్ల కేవలం పెట్రోల్, డీజిల్ మాత్రమే కాకుండా, కమర్షియల్, డొమెస్టిక్ గ్యాస్ ధరలు కూడా పెరిగాయి. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినప్పుడు సబ్సిడీల భారం ప్రభుత్వంపై పడకుండా ఉండాలంటే ధరల పెంపు ఒక్కటే మార్గమని IMF స్పష్టం చేస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే సామాన్యులపై భారీ భారం పడే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: PPF: నెలకు రూ.12,500 పెట్టుబడితో చేతికి రూ. 66 లక్షలు.. ఎలాగో తెలుసుకోండి!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి