July 15, 2026

Christopher Nolan : క్రిస్టోఫర్ నోలన్ ‘ది ఒడిస్సీ’ ట్రైలర్ రిలీజ్.. ఆస్కార్ రేంజ్

Christopher Nolan : క్రిస్టోఫర్ నోలన్ ‘ది ఒడిస్సీ’ ట్రైలర్ రిలీజ్.. ఆస్కార్ రేంజ్
Reading Time: < 1 minute
Christopher Nolans Odyssey Trailer Looks Like An Absolutely Sprawling Epic Adventure

ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్  తదుపరి చిత్రం ది ఒడిస్సీ‘. తాజాగా రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్‌తో మరోసారి సినీ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు నోలన్. రెండున్నర నిమిషాల నిడివి గల ఈ ట్రైలర్ ట్రోజన్ యుద్ధం తర్వాత ఒడిస్సీ సాగించిన ప్రమాదకరమైన సముద్ర ప్రయాణాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించాడు. గంభీరమైన సముద్ర దృశ్యాలు, పురాణ కాలం నాటి వింత జీవులు, మంత్రముగ్ధులను చేసే సైరన్‌ల మధ్య సాగే యోధుల పోరాటాలు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తున్నాయి. ఈ విజువల్స్ కి లుడ్విగ్ గోరాన్సన్ అందించిన నేపథ్య సంగీతం నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి.

ప్రముఖ టాక్ షో ‘ది లేట్ షో’లో పాల్గొన్న నోలన్ ఈ సినిమా గురించి కొన్ని మాట్లాడుతూ ‘ తన శైలికి భిన్నంగా కాకుండా ఈ కథను కూడా నాన్-లీనియర్ పద్ధతిలో అంటే కాలక్రమంతో సంబంధం లేకుండా విభిన్న కోణాల్లో తెరకెక్కిస్తున్నట్టు’ తెలిపారు. ఈ చిత్రంలో మ్యాట్ డామన్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా టామ్ హాలండ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. పెనెలోప్ పాత్రలో అన్నే హాత్వే కనిపించనుండగా జెండయా మరియు షార్లీజ్ థెరాన్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. టెక్నికల్ పరంగా కూడా ఈ సినిమా అత్యున్నత ప్రమాణాలతో రూపొందింది. పూర్తి స్థాయిలో IMAX ఫిల్మ్ కెమెరాలతో చిత్రీకరించిన ఈ చిత్రం వెండితెరపై ఒక అద్భుతమైన దృశ్యరూపాన్ని ఆవిష్కరించనుంది. నోలన్ సినిమాల్లో ఉండే ట్విస్టులు భారీతనం ఈ సినిమాలోనూ కావలిసినంత ఉండబోతున్నాయి. ఈ విజువల్ వండర్ జూలై 17, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.