Reading Time: 2 minutes

హార్థిక్ పాండ్యా లేని మ్యాచ్లో లక్నోపై ముంబై ఘన విజయం

Caption of Image.

ఈ సీజన్లో పేలవ ప్రదర్శనతో సతమతమవుతున్న ముంబై జట్టుకు ఊరట దక్కింది. సోమవారం లక్నోతో జరిగిన మ్యాచ్లో ముంబై జట్టు ఘన విజయం సాధించింది.  లక్నో నిర్దేశించిన 229 పరుగుల లక్ష్యాన్ని ముంబై జట్టు 18.4 ఓవర్లకే ఊదేసింది. ముంబై జట్టుకు ఓపెనర్లు రోహిత్ (84), రికెల్టన్ (83) శుభారంభాన్ని అందించారు. ముంబై ఇండియన్స్ హిస్టరీలోనే హయ్యెస్ట్ సక్సెస్ఫుల్ రన్ ఛేజ్ ఇదే కావడం విశేషం. హార్థిక్ పాండ్యాను ఈ మ్యాచ్లో ముంబై పక్కనపెట్టేయడం గమనార్హం. వెన్ను గాయం కారణంగా హార్దిక్ పాండ్యా లక్నోతో జరిగే మ్యాచ్‌కు దూరంగా ఉంటాడని ముంబై ఇండియన్స్ ధృవీకరించిన సంగతి తెలిసిందే. లక్నోపై 6 వికెట్ల తేడాతో ముంబై ఘన విజయం సాధించింది.

ముంబై బ్యాటర్లలో తిలక్ వర్మ 11, సూర్యకుమార్ యాదవ్ 12, నమన్ ధీర్ (23) నాటౌట్, విల్ జాక్స్ (10) నాటౌట్గా నిలిచారు. 18.4వ బంతికి విల్ జాక్స్ సిక్స్ కొట్టి ముంబైకి విజయాన్ని అందించాడు. ముంబై బ్యాటర్లను లక్నో బౌలింగ్ ఏమాత్రం కట్టడి చేయలేకపోయింది. 229 రన్స్ టార్గెట్తో బ్యాటింగ్కు దిగిన ముంబై జట్టు 10.5 ఓవర్లకు 143 పరుగులు చేసింది. రికెల్టన్, రోహిత్ శర్మ బలమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 143 పరుగుల దగ్గర ముంబై తొలి వికెట్ కోల్పోయింది. రికెల్టన్ ఔట్ అయినప్పటికీ అప్పటికే 8 సిక్సులు, 6 ఫోర్లతో 83 పరుగులు చేసి లక్నో బౌలర్లకు చుక్కలు చూపించాడు. రికెల్టన్ వికెట్ పడిన తర్వాత కూడా ముంబై విధ్వంసం ఆగలేదు. రోహిత్ శర్మ సిక్సులు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు.

177 పరుగుల దగ్గర ముంబై జట్టు రోహిత్ వికెట్ కోల్పోయింది. రోహిత్ శర్మ 7 సిక్సులు, 6 ఫోర్లతో 84 పరుగులు చేసి లక్నో ఓటమిని దాదాపుగా ఖాయం చేసి వెళ్లిపోయాడు. తిలక్ వర్మ 11 పరుగులు, సూర్య కుమార్ 12 పరుగులకే ఔట్ అయినా నమన్ ధీర్, విల్ జాక్స్ ముంబై జట్టును విజయ తీరాలకు చేర్చారు. లక్నో బౌలర్లలో షమీ, మొహ్సిన్ ఖాన్ చెరో వికెట్ తీశారు. 

మణిమారన్ సిద్ధార్థ్ 2 వికెట్లు తీసినప్పటికీ 47 పరుగులు సమర్పించుకున్నాడు. అవేష్ ఖాన్ అయితే 3.4 ఓవర్లకే 56 పరుగులు సమర్పించుకోవడం గమనార్హం. ఇక.. లక్నో బ్యాటింగ్ విషయానికొస్తే.. నికోలస్ పూరన్ 63 పరుగులు, మిచెల్ మార్ష్ 44 పరుగులతో రాణించారు. మర్క్రమ్ 31, హిమ్మత్ సింగ్ (నాటౌట్) 40 పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో కార్బిన్ బాష్ 2 వికెట్లతో రాణించగా.. రఘు శర్మ, విల్ జాక్స్, ఘజన్ ఫర్కు తలో వికెట్ దక్కింది.

©️ VIL Media Pvt Ltd.