Reading Time: < 1 minute
Mamata Banerjee Loses Bhabanipur Suvendu Adhikari West Bengal Election

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి బిగ్ షాక్ తగిలింది. మరోసారి సువేందు అధికారి చేతిలో ఘోర పరాజయం ఎదురైంది. భవానీపూర్‌లో కౌంటింగ్ ప్రారంభం అయిన దగ్గర నుంచి ఫలితం ఊగిసలాడుతూ వచ్చింది. మధ్యలో మమత మరోసారి లీడింగ్‌లోకి వచ్చినా.. కానీ అంతలోనే మారిపోయింది. చివరి రౌండ్లలో అనూహ్యంగా సువేందు అధికారి పుంజుకున్నారు. దాదాపు 15 వేల మెజార్టీతో మమతా బెనర్జీపై సువేందు అధికారి విజయం సాధించారు. 2021లో కూడా సువేందు అధికారి చేతిలోనే మమత ఓడిపోయారు. మరోసారి ఓడిపోయి పరాజయాన్ని మూటగట్టుకున్నారు.

భవానీపూర్ స్థానంలో 20 రౌండ్ల కౌంటింగ్ పూర్తైంది. సువేందుకు మొత్తం 73,463 ఓట్లు రాగా.. మమతా బెనర్జీకి 58,349 ఓట్లు వచ్చాయి. అంటే మమతా బెనర్జీ ఈ స్థానంలో మొత్తం 15,114 ఓట్ల తేడాతో ఓడిపోయారు. గత ఎన్నికల్లో బెంగాల్‌లోని నందిగ్రామ్ స్థానంలో కూడా సువేందు అధికారి మమతను ఓడించారు. అనంతరం మమత భవానీపూర్ నుంచి ఉప ఎన్నికలో పోటీ చేసి అసెంబ్లీకి చేరుకున్నారు.