
ఐపీఎల్ 2026లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతోన్న మ్యాచులో ముంబై ఇండియన్స్ బ్యాటింగ్‌లో దుమ్మురేపింది. ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ (123) సెంచరీతో కదం తొక్కడంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 243 పరుగుల భారీ స్కోర్ చేసింది. విల్ జాక్స్ (46), కెప్టెన్ పాండ్యా (31) రాణించారు. హైదరాబాద్ బౌలర్లలో నితీష్ రెడ్డి, ఇషాన్ మలింగా, ప్రఫుల్ హింగే, సాకీబ్ హోస్సేన్ తలో వికెట్ తీశారు. . అనంతరం హైదరాబాద్ 244 పరుగుల లక్ష్యంతో ఛేధనకు దిగింది.
ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచులో ముంబై టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. కెప్టెన్ హార్ధిక్ పాండ్యా నిర్ణయానికి ముంబై ఓపెనర్స్ విల్ జాక్స్, రికెల్టన్ తొలి వికెట్‌కు 93 పరుగుల భాగస్వామ్యం అందించి న్యాయం చేశారు. వేగంగా ఆడే క్రమంలో విల్స్ (46) ఔట్ కాగా ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్య (5) మరోసారి నిరాశపర్చాడు. ఈ దశలో నమన్ధీర్తో జతకట్టిన రికెల్టన్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు.
హైదరాబాద్ బౌలర్లను ఊచకోత కోస్తూ కేవలం 44 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకున్నాడు. నమన్ ధీర్ (22) ఔటైన తర్వాత క్రీజులో వచ్చిన కెప్టెన్ హార్ధిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 15 బంతుల్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు బాది 31 రన్స్ చేసి ఔటయ్యాడు. దీంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల కోల్పోయి 250 పరుగుల భారీ స్కోర్ చేసింది. హైదరాబాద్ బౌలర్లలో నితీష్ రెడ్డి, ఇషాన్ మలింగా, ప్రఫుల్ హింగే, సాకీబ్ హోస్సేన్ తలో వికెట్ తీశారు.