Reading Time: < 1 minute
Kcr Welcomes Jeevan Reddy Into Brs Jagtial Meeting

ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో కీలక మార్పు చోటుచేసుకుంది. సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి అధికారికంగా బీఆర్ఎస్ (BRS) గూటికి చేరారు. జగిత్యాలలో నిర్వహించిన భారీ ‘ప్రజా ఆశీర్వాద సభ’ వేదికగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

జగిత్యాల పార్టీ కార్యాలయం నుండి కేసీఆర్ భారీ కాన్వాయ్‌తో సభా ప్రాంగణానికి బయలుదేరారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న అభిమానులకు, పార్టీ కార్యకర్తలకు అభివాదం చేస్తూ ఆయన వేదిక వద్దకు చేరుకున్నారు. స్టేజ్ పైకి రాగానే కేసీఆర్ తనదైన శైలిలో ప్రజలకు అభివాదం చేయడంతో సభా ప్రాంగణం అంతా జై తెలంగాణ నినాదాలతో మారుమోగిపోయింది.

Japan Tsunami Warning: దూసుకొస్తున్న సునామీ.. జపాన్‌లో 10 అడుగుల ఎత్తున ఎగిసిపడుతున్న కెరటాలు!

నాలుగు దశాబ్దాల పాటు కాంగ్రెస్‌లో ఉన్న జీవన్ రెడ్డి, కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరడం జిల్లా రాజకీయాల్లో పెను మార్పుగా భావిస్తున్నారు. జీవన్ రెడ్డి అనుభవం పార్టీకి ఎంతో బలాన్ని ఇస్తుందని, జగిత్యాల నియోజకవర్గంతో పాటు ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ మరింత పటిష్టం అవుతుందని కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కీలకమైన సభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది. అయితే, దీనికి గల కారణాన్ని పార్టీ వర్గాలు వెల్లడించాయి. నిన్న జరిగిన జగిత్యాల పర్యటనలో భాగంగా తీవ్రమైన ఎండల వల్ల కేటీఆర్ వడదెబ్బకు గురయ్యారు.

ప్రస్తుతం ఆయన వైద్యుల సలహా మేరకు విశ్రాంతి తీసుకుంటుండటంతో నేటి సభకు రాలేకపోయినట్లు సమాచారం. వేదికపై నుండి కేసీఆర్ ప్రజలకు , కార్యకర్తలకు ప్రత్యేకంగా అభివాదం చేస్తూ ఉత్సాహపరిచారు. జీవన్ రెడ్డి చేరిక నేపథ్యంలో జగిత్యాల నియోజకవర్గం నలుమూలల నుండి భారీగా జనం తరలివచ్చారు. రాబోయే ఎన్నికల నేపథ్యంలో సీనియర్ నేతలను కలుపుకుపోవడం ద్వారా పార్టీని బలోపేతం చేయాలని కేసీఆర్ సంకేతాలిచ్చారు.

TFDA : తెలుగు చిత్రసీమలో సరికొత్త సంచలనం.. దర్శకుల కోసం చదలవాడ శ్రీనివాసరావు బంపర్ ఆఫర్