Reading Time: < 1 minute
Pm Modi Inaugurates Delhi Dehradun Expressway Travel Time Reduced Features

ఢిల్లీ-డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వే‌ను ప్రధాని మోడీ ప్రారంభించారు. ఉత్తర భారతదేశాన్ని కనెక్టివిటీ చేసే కీలకమైన మార్గాన్ని మోడీ జాతికి అంకితం చేశారు. అనంతరం సహారన్‌పూర్‌లో ప్రధాని మోడీ రోడ్‌షో నిర్వహించారు. మోడీని చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు.

210 కిలోమీటర్ల పొడవైన గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభంతో ఢిల్లీ నుంచి డెహ్రాడూన్‌కు ప్రయాణ సమయం ఆరు గంటల నుంచి కేవలం రెండున్నర నుంచి మూడు గంటలకు తగ్గుతుంది. ఈ ప్రాజెక్ట్ ప్రకృతి పరిరక్షణకు, ఆధునిక ఇంజనీరింగ్‌కు గొప్ప ఉదాహరణగా నిలవనుంది. రాజాజీ టైగర్ నేషనల్ పార్క్ మీదుగా వెళ్లే ఆసియాలోనే అత్యంత పొడవైన 12 కిలోమీటర్ల గ్రీన్ ఎలివేటెడ్ వన్యప్రాణి కారిడార్ ఉంది.

ఈ ఎక్స్‌ప్రెస్‌వే ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లను కలుపుతుంది. పర్యాటకాన్ని ప్రోత్సహించి డెహ్రాడూన్, మసూరీ, చార్ ధామ్ ధామ్‌లకు ప్రయాణాన్ని సులభతరం చేయనుంది. ఇక ఎక్స్‌ప్రెస్‌ వేకు యమునా ఎక్స్‌ప్రెస్‌వే, జాతీయ రహదారులు, 10కి పైగా రాష్ట్ర రహదారులతో ప్రత్యక్ష అనుసంధానాలు ఉన్నాయి.

ఢిల్లీ-డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వే ప్రత్యేకతలు ఇవే..
210 కిలోమీటర్ల పొడవైన అత్యాధునిక గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే
సుమారు రూ.11,970 కోట్ల వ్యయం
ఆసియాలోనే అతిపెద్ద హరిత ఎలివేటెడ్ కారిడార్, 12 కిలోమీటర్ల పొడవు
మార్గం పొడవునా సీసీటీవీ కెమెరాలు, సోలార్ లైట్లు, పచ్చదనం
డ్రోన్ల ఎగరవేతపై నిషేధం, ప్రతి దశలోనూ భద్రత

 

View this post on Instagram

 

A post shared by Narendra Modi (@narendramodi)